సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వివిధ వీడియోలకు స్పందిస్తూ ఉంటారు భారతీయ దిగ్గజ వ్యాపారవేత ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ).
సామాజిక స్ఫూర్తితో పాటు చాలామందిని ప్రోత్సాహం తెలిపే విధంగా ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇక ఇందుకు సంబంధించి అసలు మ్యాటర్ ఏమిటంటే.కొన్ని నెలల క్రితం అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ ( American YouTuber Christopher Lewis )పార్ట్ టైం ఫుడ్ స్టాల్ లో పనిచేస్తూ పీహెచ్డీ స్టూడెంట్ అని తన వీడియోలో షేర్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.PhD స్కాలర్ అయిన చెన్నై విక్రేత రేయాన్( Chennai Vikretha Rayon ), తన పరిశోధనా పత్రాలను ఆన్‌లైన్‌లో గర్వంగా ఎలా చూపించాడో వీక్షించండి అంటూ ఫాలోవర్స్‌కు తెలియచేసారు.
దింతో పీహెచ్డీ స్టూడెంట్ స్ఫూర్తికి ఆనంద్ మహేంద్ర ప్రస్తావిస్తూ.యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి ప్రస్తావించకుండా వాటికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్‌లైన్‌లో చూపించడాన్ని ప్రశంసించారు.అతడి ఆలోచనా విధానం తనకు నచ్చిందని, ప్రత్యేకంగా అనిపించిందని తెలిపాడు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ జీవితంలో విజయం సాధించాలి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు.
అభిరుచితో కూడిన పని చేసుకుంటే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే అతడు పడుతున్న కష్టాన్ని కొనియాడారు.