ప్రేమలు తర్వాత సరైన సినిమాలనే సెలెక్ట్ చేసుకున్న నస్లెన్, మమితా.. తిరుగుండదు..?

మలయాళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ప్రేమలు (2024)లో నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు ( Naslen K Gafoor)పేరు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే వీరిద్దరూ ప్రేమికుల్లాగా చాలా చక్కగా కనిపించారు.

 Premalu Artists Are Doing Selective Movies ,mamitha Baiju , Premalu , Naslen K-TeluguStop.com

వీరి మధ్య కెమిస్ట్రీ చాలామందిని ఆకట్టుకుంది.రూ.3 కోట్లతో తీస్తే రూ.136 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా సంచలనం అయ్యిందని చెప్పుకోవచ్చు.వీరి గురించి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఈ జంట ఏ సినిమాలో నటిస్తున్నారు? ఈ సినిమా తర్వాత వీరి కెరీర్ మారిపోయిందా? అని చాలామంది ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన అప్‌కమింగ్ ప్రాజెక్టుల గురించి తెలిసింది.వారి కెరీర్ లైఫ్ ఈ సినిమా వేరే రేంజ్‌కు చేరుకుందని వారి అప్‌కమింగ్ ప్రాజెక్టులను బట్టి చూస్తే తెలుస్తోంది.

Telugu Khalid Rahman, Mamitha Baiju, Naslen Gafoor, Pooja Hegde, Premalu, Thalap

మలయాళ యాక్ట్రెస్ మమితా బైజు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకుంటుంది.ఈ కేరళ ముద్దుగుమ్మ ఇటీవల కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ దళపతి 69వ సినిమాలో ఓ కీలకమైన రోల్‌ దక్కించుకుంది.హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న దళపతి 69 విజయ్ కు లాస్ట్ సినిమా కాబోతోంది.ఈ సినిమా తర్వాత విజేత జీవితాన్ని పాలిటిక్స్ కే అంకితం చేస్తాడు.

ఈరోజే ఈ సినిమా ప్రొడక్షన్ కూడా ప్రారంభమైంది.ఒక పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి సినిమా షూటింగ్ కూడా ప్రారంభించేశారు.

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఇందులో యాక్ట్రెస్ పూజా హెగ్డే కూడా ఒక లీడింగ్ లేడీ గా కనిపించనుంది.

మమితా బైజు( Mamitha Baiju )కు పూజా కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు.ప్రియమణి, ప్రకాష్‌రాజ్‌ లాంటి అగ్ర నటులు కూడా ఇందులో నటిస్తున్నారు.

ఇంత పెద్ద సినిమాలో మమితా అత్యంత ముఖ్యమైన పాత్ర దక్కించుకోవడం నిజంగా విశేషం.ఈ సినిమా సూపర్ హిట్ అయితే మమితా తన కెరీర్ లో ఓ పెద్ద మెట్టు ఎక్కుతుంది.

తర్వాత ఆమెకు ఆఫర్లు వరుసగా వస్తాయని చెప్పుకోవచ్చు.మమితా చాలా తెలివిగా ఆలోచించి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Khalid Rahman, Mamitha Baiju, Naslen Gafoor, Pooja Hegde, Premalu, Thalap

ఇక నస్లెన్ విషయానికొస్తే ఈ హ్యాండ్సమ్‌ హీరో “తల్లుమాల” మూవీ ఫేమ్ ఖలీద్ రెహమాన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.ఖలీద్ రెహమాన్‌ చాలా టాలెంటెడ్ డైరెక్టర్.మంచి నటుడు కూడా.మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో ఒక డ్రైవర్ గా నటించాడు.ఖలీద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నస్లెన్, లుక్మాన్ హీరోలుగా కనిపించనున్నారు.ఖలీల్ మంచి డైరెక్టర్ కాబట్టి అతని కచ్చితంగా మంచి సినిమాలే తీస్తాడు కాబట్టి నస్లెన్ సరైన సినిమానే ఎంచుకున్నాడని చెప్పవచ్చు.

ఈ యంగ్ హీరో “ఐయామ్ కథలన్‌” అనే ఒక మలయాళ థ్రిల్లర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube