యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా (Devara Movie) ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఆరు రోజులలోనే బ్రేక్ ఈవెన్ అయింది.
ఇలా వారం రోజుల్లోనే అన్ని భాషలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.ఇకపోతే దేవర సినిమాలో చుట్టూ మల్లే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు ఎన్నో రీల్స్ దర్శనమిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కపిల్ శర్మ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ చుట్టుమల్లే సాంగ్ లో చాలా రొమాంటిక్ గా నటించారు.మీ వైఫ్ చూస్తే ఫీల్ అవుతారని కొరటాల గారు అడ్డు చెప్పలేదా అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ షాకింగ్ సమాధానం చెప్పారు.అసలు చుట్టుమల్లే సాంగ్ కొరటాల గారు డైరెక్షన్ చేయలేదంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఈ పాట షూటింగ్ థాయిలాండ్ లో జరిగిందనీ, ఈ పాట షూట్ చేస్తే సమయంలో కొరటాల గారికి ఏదో పని ఉండడంతో ఆయన షూటింగుకు రాలేదని తెలిపారు.అందుకే ఈ పాటకు కొరియోగ్రాఫర్ డైరెక్షన్ చేశారు అంటూ ఈ సందర్భంగా చుట్టుమల్లే సాంగ్ గురించి ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా విడుదల తర్వాత వరుసగా సెలవులు రావడమే కాకుండా ప్రస్తుతం దసరా సెలవులు కూడా ఉండడంతో భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.