డైలీ మార్నింగ్‌ పాలల్లో ఈ పొడిని కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం.రెగ్యులర్ డైట్ లో సరైన ఫుడ్స్ ను చేర్చుకుంటే వివిధ రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

 If You Take This Powder In Milk You Will Get Many Health Benefits Details, Heal-TeluguStop.com

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అధిక బరువు సమస్యను దూరం చేయడానికి సహాయపడడమే కాకుండా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్( Health Benefits ) మీ సొంతం చేస్తుంది.

మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం ప‌ప్పు( Almonds ) వేసి దోర‌గా వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు నువ్వులు( Sesame Seeds ) మరియు ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) వేసి విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న బాదం పప్పు, నువ్వులు మరియు అవిసె గింజలను మెత్త‌ని పొడి మాదిరి గ్రౌండ్ చేసుకోవాలి.

బాదం నువ్వులు అవిసె గింజల పొడిలో వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు ఆర్గానిక్ బెల్లం పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Almonds, Fat Cutter, Flax Seeds, Tips, Latest, Sesame Seeds, Powder-Telug

డైలీ మార్నింగ్‌ గ్లాస్ గోరు వెచ్చని పాల‌ల్లో( Milk ) వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి తీసుకోవాలి.ఈ బాదం నువ్వులు మరియు అవిసె గింజల పొడిలో వివిధ రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.నిత్యం ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.

అతిగా తినడం తగ్గిస్తారు.వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.

Telugu Almonds, Fat Cutter, Flax Seeds, Tips, Latest, Sesame Seeds, Powder-Telug

అలాగే ఈ పొడి ఎముకలు కండరాలను బలోపేతం చేస్తుంది.మోకాళ్ల నొప్పుల నుండి విముక్తి కలిగిస్తుంది.మెదడు చురుకుదనాన్ని పెంచడానికి, జ్ఞాపకశక్తి ఆలోచన శక్తిని మెరుగుపరచడానికి కూడా ఈ పొడి సహాయపడుతుంది.అంతేకాదు నిత్యం పాలల్లో కలిపి ఈ పొడిని తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.నీరసం అలసట వంటివి పరార్ అవుతాయి.

చర్మం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube