సాధారణంగా మనలో చాలా మంది స్కిన్ కలర్ ను( Skin Color ) ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతుంటారు.ముఖ్యంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవాలని రకరకాల క్రీమ్, సీరం తదితర చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మాత్రం స్కిన్ వైట్నింగ్ కు( Skin Whitening ) చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
టిప్ -1:
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టమాటో స్లైసెస్( Tomato Slices ) మరియు పావు కప్పు ఫ్రెష్ కలబంద జెల్( Aloevera Gel ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.అలాగే సరిపడా టమాటో అలోవెరా ఫ్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ శుభ్రంగా స్కిన్ ను క్లీన్ చేసుకోవాలి.వారానికి మూడు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ కలర్ అద్భుతంగా పెరుగుతుంది.
చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముఖంపై మురికి మృతకణాలు కూడా తొలగిపోతాయి.
టిప్-2:
అలాగే స్కిన్ టోన్ పెంచడానికి మరొక అద్భుతమైన టిప్ ఉంది.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉలవ పిండి( Horse Gram Flour ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.ఈ రెమెడీ చర్మ కణాలను లోతుగా శుభ్రం చేస్తుంది.చర్మం రంగును పెంచుతుంది.
స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
చర్మం అందంగా మెరుస్తుంది.