ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వ్యవహారం సంచలనంగా మారింది.గత ప్రభుత్వ హయామంలో తిరుపతి లడ్డు( Tirumala Laddu ) తయారీలో కల్పి జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.
అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు విచారణలో భాగంగా కోర్టు కూటమి ప్రభుత్వానికి మొట్టిక్కాయలు వేసింది.ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ మండిపడింది.
సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించాలి అంటూ విచారణలో వెల్లడించింది.
ఇలా సుప్రీంకోర్టు( Supremecourt ) తీర్పు ఇవ్వడంతో ఈ తీర్పు పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ( Purandeshwari )మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత తనకు ఉందని సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను తప్పు పట్టడం సరికాదంటూ ఈమె కోర్టును కూడా తప్పు పట్టారు.ఇలా పురందేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రోజా ఈ విషయంపై స్పందిస్తూ.బావ కళ్లలో ఆనందం కంటే.
భక్తుల కళ్లలో ఆనందం చూడాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ( Former minister Roja )సెటైర్లు వేశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.న్యాయస్థానం చంద్రబాబు ఆరోపణలను తప్పుపట్టిందన్నారు రోజా.లడ్డూలో వాడిన నెయ్యి కల్లీ జరిగినట్టు ఆధారాలు లేవని కోర్టు తేల్చేసిందని గుర్తు చేశారు.
కానీ.సీఎంను పురుందేశ్వరి వెనకేసుకొని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డు వ్యవహారం కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని తమ ప్రభుత్వంలో ఎలాంటి కల్తీలు జరగలేదని కోర్టు విచారణతో బాబు అడ్డంగా దొరికిపోయారు అంటూ రోజా కామెంట్లు చేశారు.