టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో దర్శకుడు శ్రీనువైట్ల ( Sreenu Vaitla ) ఒకరు.ఈయన డైరెక్షన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అలాగే ఈయన డైరెక్షన్లో చేసిన హీరోలు అందరూ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న శ్రీనువైట్ల క్రమక్రమంగా సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి దీంతో ఈయనకు ఇండస్ట్రీలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి.
ఇలా అవకాశాలు లేకపోవడంతో గత కొంతకాలంగా శ్రీనువైట్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా శ్రీను వైట్లకు గోపీచంద్ ( Gopi Chand ) అవకాశం కల్పించారు.గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం విశ్వం(Vishwam) .ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శ్రీను వైట్ల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కెరీర్ కి సంబంధించి పలు విషయాలను తెలిపారు.

తన కెరియర్ ఇలా అవ్వడానికి కారణం మహేష్ బాబు హీరోగా నటించిన ఆగడు సినిమా అని తెలిపారు.నిజానికి ఈ సినిమా కథ వేరే ఉంది భారీ బడ్జెట్ అవుతుందన్న కారణంగా కథలో మార్పులు చేశామని అదే ఈ సినిమాకి మైనస్ అయిందని శ్రీను వైట్ల తెలిపారు.ఈ సినిమా చేయకుండా ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదని ఈ సినిమా ద్వారా నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అంటూ శ్రీను వైట్ల ఆగడు సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక విశ్వం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
ఇందులో ప్రేక్షకులకు కావలసిన యాక్షన్స్ సన్ని వేషాలతో పాటు కామెడీ సీన్స్ కూడా ఉన్నాయని గోపీచంద్ వెల్లడించారు.