లడ్డూ వివాదం : ఆ ముగ్గురికి షర్మిల విజ్ఞప్తి 

తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం( Tirupati laddu ) ఇంకా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే మారింది.ఈ కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం , ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం,  దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలకడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 Laddu Controversy: Sharmila S Appeal To The Three, Tirumala Laddu Issue, Jagan,-TeluguStop.com

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) స్పందించారు.తిరుమలలో కల్తీ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు చూస్తే విచారణకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ ,  కేంద్ర దర్యాప్తు అవసరమని భావిస్తున్నట్లుగా ఉందని షర్మిల అన్నారు.

లడ్డు కల్తీ విషయం వెలుగు చూడగానే దీనిపై సిబిఐ విచారణ జరపాలని అందరికంటే ముందుగా కేంద్రానికి కాంగ్రెస్ పార్టీనే లేఖ రాసిందని షర్మిల అన్నారు.

Telugu Ap Congress, Chandrababu, Jagan, Pavan Kalyan, Tirupati Laddu, Ys Jagan-P

గవర్నర్ ను కలిసి ఇందుకోసం చొరవ తీసుకోవాలని కోరామని,  అలాగే లడ్డు కల్తీ విషయాన్నీ సుమోటాగా తీసుకుని విచారణ నిర్వహించాలని సిజేఐకి కాంగ్రెస్ లేఖ రాసిందనే విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.సిబిఐ దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని,  సిబిఐ దర్యాప్తు కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ( Congress party )నే అని షర్మిల అన్నారు.లడ్డు కల్తీ అంశంపై దయ చేసి రాజకీయం చేయవద్దని ,మతం రంగు పులమొద్దు అని పవన్, చంద్రబాబు, జగన్ లకు షర్మిల సూచించారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ ముందే చెప్పిందని ఆమె అన్నారు.కానీ ఒకరు శాంతి పూజలని , మరొకరు ప్రాయశ్చిత్తం దీక్షలని , ఇంకొకరు ప్రక్షాళన పూజలు అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

Telugu Ap Congress, Chandrababu, Jagan, Pavan Kalyan, Tirupati Laddu, Ys Jagan-P

కాంగ్రెస్ చెప్పినట్లుగానే లడ్డు కల్తీ అంశాన్ని రాజకీయం చేయవద్దంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.లడ్డు కల్తీ విషయాన్నీ రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  వైసీపీ అధినేత జగన్ లకు షర్మిల విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube