నేత కార్మికులు ఆర్దికంగా ఎదిగేందుకు ప్రభుత్వ తోడ్పాటు - రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :నేత కార్మికులు ఆర్దికంగా స్వతంత్రంగా ఎదగాలని, దీనికి అవసరమైన సంపూర్ణ తోడ్పాటు ప్రభుత్వం అందిస్తుందని, ద్వారా నేత కార్మికులకు లాభం చేకూరుతుందని రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.మంగళవారం వేములవాడ లో పర్యటించిన రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ లు స్వాగతం పలికారు.

 Government Support For Economic Growth Of Weavers State Principal Secretary Shai-TeluguStop.com

అనంతరం వేములవాడలో నేత కార్మికుల సమస్యలు , వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, పెండింగ్ బకాయిలు, ఆర్డర్లు తదితర అంశాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, సిరిసిల్లలో ఎటువంటి సంక్షోభం ఉండవద్దని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, నేత కార్మికులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.

నూలు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పెండింగ్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించామని, మిగిలిన బకాయిలు ఉంటే వాటి చెల్లింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.తెలంగాణలోని మహిళ సంఘాలకు 2 చీరల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా నేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు.తెలంగాణ సాంస్కృతి, చరిత్రను ప్రతిభంబించేలా మహిళా సంఘాల కు యూనిఫాం విధంగా ఆ చీర ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని, దానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ రావాలని అన్నారు.

మహిళా గ్రూపులతో, చేనేత పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడామని , పాలిస్టర్ చీర జరీ అంచు ఉంటుందని అన్నారు.ఆధునికంగా ఉండే విధంగా చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారని ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు.

సిరిసిల్ల జిల్లాలో స్వతంత్రంగా ఆ చీరలు తయారు చేసే అవకాశం కల్పించాలని ఆసాములు కోరడంతో ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసి దానికి తగిన విధంగా చర్యలు చేపట్టిందని అన్నారు.నూలు డిపో పెట్టిన తర్వాత దాని తరలింపు బాధ్యత ఆసాముల దేనని అన్నారు.

సొసైటీకి నూలు అప్పగించిన తర్వాత లాభాలను సేట్లు, ఆసాములు, వర్కర్లు ఎలా తీసుకుంటారు అనే అంశాలను వివరించాలని అన్నారు.ప్రస్తుతం వచ్చే లాభం అధికంగా ఆసాములకు చేరాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు.100% దీని పైన ఆధారపడకుండా ప్రైవేట్ మార్కెట్ లో కూడా చేనేతలు రాణించేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

హైదరాబాద్ లో కోఠి,బేగం బజార్ ప్యారడైస్ చుట్టు పక్కల ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ సూరత్ నుంచి తెచ్చి ప్రింటింగ్ చేస్తున్నారని, మన సిరిసిల్ల చేనేతలు అవకాశాలు అంది పుచ్చుకోవాలని , అవకాశాలను చేనేతలు అందుపుచ్చుకోవాలని ప్రిన్సిపల్ కార్యదర్శి సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ , చేనేత రంగంలో అనుభవం కలిగిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక శ్రద్ధ వహించి సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని అన్నారు.చేనేత సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం పెట్టిన 190 కోట్ల బకాయిలను విడుదల చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెస్కో జీఏం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాల వల్ల దీర్ఘకాలంలో నేత కార్మికులకు లాభం చేకూరుతుందని అన్నారు.గతంలో కేవలం వైట్ క్లాత్ మాత్రమే తయారు చేశారని, అక్కడి నుంచి పీసీ, కలర్, జరీ అంచు చీరలు, జకాడ్ క్రమక్రమంగా మార్పు సాధించామని, ఈ మార్పు ఇంకా ముందుకు తీసుకొని వెళ్లాలని అన్నారు.

నేత కార్మికులు సొంత కాళ్ళ మీద నిలబడాలని అన్నారు.సంఘ అధ్యక్షులకే కాకుండా ఆసాములకు కూడా లాభం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

టెస్కో అందించే ఆర్డర్లను చేస్తూనే ప్రైవేట్ రంగంలో గల అవకాశాలను చేనేతలు అందిపుచ్చుకోవాలని , హైదరాబాదులో ప్రతిరోజు లక్షల మీటర్ల ఆర్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, వీటిని చేనేతల సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆసాములు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన అవకాశాలను వాడుకుంటామని వచ్చే లాభాలను సంఘంలోని సభ్యులంతా సమానంగా పంచుకుంటామని, నూలు డిపో ఏర్పాటు వల్ల మంచి జరుగుతుందని అన్నారు.

అదేవిధంగా ఆ సమయంలో తమ వద్ద పని చేసే కార్మికులకు సైతం లాభం చేకూరుస్తామని అన్నారు.ఈ సమవేశం లో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఆలయ ఈఓ వినోద్ రెడ్డి, టెస్కో జీఎం అశోక్ రావు, ఏడీ హ్యాండ్లూమ్స్ సాగర్, నేత కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube