టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఒకరు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా( Devara Movie ) విడుదలైన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీ విడుదల ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ అభిమాని( NTR Fan ) క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి ఒక వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కౌశిక్( Kaushik ) అనే అభిమాని క్యాన్సర్ తో( Cancer ) బాధపడుతున్నారు అయితే తాను ఎన్టీఆర్ కి పెద్ద అభిమాని.తాను దేవర సినిమా చూడాలని కోరుకుంటున్నాను అని ఆ సినిమా చూసేవరకు నన్ను బ్రతికించండి అంటూ తన తల్లిదండ్రులను వేడుకున్నారని కౌశిక్ తల్లితండ్రులు మీడియా ఎదుట కన్నీరు అయ్యారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలు వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ వరకు చేరింది.ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా కౌశిక్ తో వీడియో కాల్ ద్వారా మాట్లాడి తనుకు ధైర్యం చెప్పారు.
ఇక ఎన్టీఆర్ కౌశిక చికిత్స కోసం కొంతమేర ఆర్థిక సహాయం కూడా చేశారని తెలుస్తుంది అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) వారు కౌశిక్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే తిథిదే దేవస్థానం మెడికల్ డిపార్ట్మెంట్ ఏకంగా 40 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి లేఖ రాశారు.కౌశిక్ తండ్రి శ్రీనివాసులు తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్న తరుణంలో ఆయన కుమారుడి చికిత్స కోసం ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది.