రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్, లింగన్నపేట,లక్ష్మీపూర్ తండాల లో నాటు సారాయి ముడి సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి బెల్లం పటిక, వాటితో పాటు ఐదు లీటర్ల గుడుంబా లభ్యమయిందని ఎక్సైజ్ సి ఐ ఎం శ్రీనివాస్ తెలిపారు.రవాణా చేస్తున్నటువంటి మాచారెడ్డి గ్రామానికి చెందిన అజ్మీర నాజం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆల్టో కార్ లో ఉన్నటువంటి ముడి సరుకులను,నాటు సారాయిని స్వాధీన పరుచుకున్నమనీ ఎక్సైజ్ సీఐ ఎం శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో కానిస్టేబుల్ రాజు,మల్లేష్, కిషోర్,కృష్ణ కాంత్,భవానీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట,ముస్తాబాద్,, గంభీరావుపేట్,వీర్నపల్లి, కోనరావుపేట మండల ప్రజలకు నాటు సారాయి తయారీ అమ్మకాలు జరిపితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నాటు సారాయి,గంజాయి,పటిక బెల్లం ఎవరి వద్దనైనా కలిగి ఉన్నట్లయితే 871 26 58 830 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించగలరని తెలిపారు.







