రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి దశ నుండే వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో RSE-“ROAD SAFETY EDUCATION CLASSES.
సిరిసిల్ల పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ పేజ్ -2 అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై ట్రాఫిక్ రూల్స్,సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, వాహనాల చట్టాలు,రోడ్ భద్రత నియమాల ఆవాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థి దశ నుండే వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కలిగి ఉండలానే ఉద్దేశ్యంతో గత సంవత్సరం జిల్లాలో అని పాటశాలల్లో, కళాశాలలో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ పేరుతో అవగాహన కల్పించమని,రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ పేజ్ -2 పేరుతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
విద్యార్థిని విద్యార్ధులకు ట్రాఫిక్ రూల్స్,సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, వాహనాల చట్టాలు,రోడ్ భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండ ఉంటాయని,ట్రాఫిక్ నియమ నిబంధనలు విద్యార్థి దశ నుండే అలవర్చుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు, అదే విదంగా విద్యార్థులు రోడ్డుపై జరిగే ప్రమాదాలను తల్లి దండ్రులకి, ప్రజలకు తెలియచేసి వారి లో చైతన్యం పర్చి ప్రతి వ్యక్తి రోడ్డు పై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించే విదంగా నియమ నిబంధనలు పాటించే విదంగా తయారుచేయాలన్నారు.
ఎస్పీ వెంట టౌన్ సి.ఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, ఎన్జీవో ఒఝా, పాటశాల సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.







