రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమల గ్రామంలో ఓ యువకుడు ట్రాక్టర్ టైర్ కిందపడి మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో వినాయకుడి ఊరేగింపు కార్యక్రమంలో న్యాలకొండా రాకేష్ 18 ట్రాక్టర్ పై నుండి కింద పడడంతో ఇంజన్ కు ఉన్నా పెద్ద టైర్ రాకేష్ నుండి వెళ్ళింది.
స్థానికులు వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు వెంటనే పరీక్షించి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
రఘుపతి, పద్మ లకు ఏకైక కుమారుడు కావడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.