2023లో వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ “విరూపాక్ష( Virupaksha )”లో హీరోగా సాయి ధరంతేజ్ నటించిన సంగతి తెలిసిందే.కానీ ముందుగా ఈ రోల్‌కు అతన్ని సెలెక్ట్ చేయలేదు.
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి( Ambati Arjun )ను తీసుకోవాలని దర్శకుడు కార్తీక్ వర్మ దండు అనుకున్నాడు.అర్జున్, కార్తీక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్.
కార్తీక్ “శాసనం” పేరిట ఒక కథ రాసుకొని ప్రొడ్యూసర్ కోసం ఏకంగా రెండేళ్లు వెతికాడు.ప్రొడ్యూసర్లకు తమ టాలెంట్ చూపించడానికి 40 నిమిషాల ఫిలిం కూడా తీశాడు.
దాన్ని చూపిస్తూ తమకు చాలా టాలెంట్ ఉందని నమ్మి సినిమా తీయాలంటూ కోరాడు.కానీ అర్జున్ లాంటి కొత్త నటుడితో, శాసనమనే కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు.
తర్వాత సుకుమార్( Sukumar )కు ఈ స్టోరీ వినిపించడం జరిగింది.
![Telugu Ambati Arjun, Karthikvarma, Sai Dharam Tej, Samyuktha Menon, Virupaksha-M Telugu Ambati Arjun, Karthikvarma, Sai Dharam Tej, Samyuktha Menon, Virupaksha-M](https://telugustop.com/wp-content/uploads/2024/09/virupaksha-movie-Ambati-Arjun-Sai-Dharam-Tej-Karthik-Varma-Dandu-Samyuktha-Menon.jpg)
అది సుకుమార్ Sukumar ) కు బాగా నచ్చింది.అందుకే ఆయన ఈ మూవీని స్క్రీన్ ప్లే రాశాడు.అంతేకాదు దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకు వచ్చాడు.
B.V.S.N.ప్రసాద్ కూడా ఈ మూవీని బ్యాంకు రోల్ చేశాడు.ఇందులో సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా తీసుకున్నారు.
సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది.రూ.40 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఈ సినిమా రూ.103 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇదే అతిపెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాకు ముందు సాయి ధరమ్ తేజ కెరీర్ ఖతం అని అనుకున్నారు.అది అతనికి మంచి సమయంలో మంచి హిట్ అందించి అతడి కెరీర్‌ను నిలబెట్టింది.
![Telugu Ambati Arjun, Karthikvarma, Sai Dharam Tej, Samyuktha Menon, Virupaksha-M Telugu Ambati Arjun, Karthikvarma, Sai Dharam Tej, Samyuktha Menon, Virupaksha-M](https://telugustop.com/wp-content/uploads/2024/09/virupaksha-Ambati-Arjun-Sai-Dharam-Tej-Karthik-Varma-Dandu-Samyuktha-Menon.jpg)
ఈ సినిమా 2023, మే 5న హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో డబ్ అయి థియేటర్లలో రిలీజ్ అయింది.అన్ని భాషల్లో కూడా ఈ మూవీ బాగా ఆడింది.ఇది చాలా కొత్త స్టోరీ తో రావడం వల్ల అందరూ చూశారు.
ఈ చిత్రం డిజిటల్, శాటిలైట్ హక్కులను వరుసగా నెట్‌ఫ్లిక్స్, స్టార్ మా దక్కించుకున్నాయి.ఇంత పెద్ద హిట్ మూవీని కోల్పోయినందుకు తనకు చాలా బాధగానే ఉందని అర్జున్ అంబటి ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
అయితే ఈ మూవీని తాను చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ అయి ఉండేది కాదని అర్జున్ ఒప్పుకున్నాడు.తనతో సినిమా తీస్తే తన ఫ్రెండ్ ఇంత సక్సెస్ అయ్యి ఉండేవాడు కాదని, తన ఫ్రెండ్ సక్సెస్ అనేది తన సక్సెస్ తో సమానం అని అతని తెలిపాడు.