గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

గణేష్ శోభయత్రలో ఎట్టి పరిస్థితుల్లో డిజే లను అనుమతి లేదు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 A Solid Arrangement For Ganesh Namazjanotsavam , Ganesh Namazjanotsavam, Solid-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ ,సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,భక్తులు, మండపాల నిర్వహకులు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమార్జనం పూర్తి చేయాలన్నారు.

నిబంధనలు తప్పక పాటించాలి.నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదన్నారు.గణేష్ మండపాల నిర్వహకులు ఆలస్యం చేయకుండా నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి చేయాలని,శోభాయాత్స మయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినెల పాటలు పెట్టిన, బాణాసంచా కలుస్తూ ఇబ్బందులకు గురిచేసిన కఠిన చర్యలు తప్పవన్నారు.

మద్యపానం సేవించి శోభయత్రలో ఇతరులకు ఇబ్బందులు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు .జిల్లాలో 2200 విగ్రహాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2200 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 400, వేములవాడ పట్టణంలో 300, ఆయా మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం దాదాపు 2200 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని, వేడుకలు ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, మొగిలి ,సిబ్బంది ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube