స్టార్ హీరోలారా.. ఇక మీ ఆటలు చెల్లవు.. అన్ని తగ్గించుకోవాల్సిందే..!

ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు ఆ హీరోల రెమ్యునరేషన్( Remuneration of heroes ) అందుకోవడం నిర్మాతలకు సాధ్యం కావడం లేదు అలా ఉంది పరిస్థితి.మరి తెలుగులో అయితే హీరోల పారితోషకాలు భయంకరంగా ఉంటున్నాయి.

 Tollywood Heros Remuneration And Demands , Demand Crores, Tollywood Heros , Rem-TeluguStop.com

కోట్లు డిమాండ్ చేస్తున్నారు అందుకే కేవలం స్టార్ హీరోలతోనే పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తున్నారు.వారిని పెట్టుకొని కోట్ల కు కోట్లు ఇచ్చి సినిమా తీయాలంటే వసూళ్లు కూడా అదే రేంజ్ లో జరగాలి.

అలా జరగాలంటే మార్కెట్ ఉన్న హీరో పైనే ఆధార పడాల్సి వస్తుంది.మరి మార్కెట్ ఉన్న హీరో కోట్లు అడుగుతాడు.

ఆ కోట్లను వసూలు చేయాలంటే సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 50 శాతానికి పైగా కలెక్షన్స్ వసూలు అవ్వాలి.

Telugu Demand, Tollywood, Tollywood Heros, Tollywoodheros-Telugu Top Posts

అది సాధ్యం కానీ నేపద్యంలో హీరో పరిస్థితి ఎలా ఉన్నా నిర్మాత( Producer ) మాత్రం నిండా మునిగిపోతున్నాడు.పూర్తిగా రిస్కుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇక సినిమా పరిశ్రమకు నిర్మాతలు ముందులా రావడం లేదు.సినిమా తీయాలంటే భయపడే పరిస్థితిలో చాలామంది ఉన్నారు.

కేవలం 7, 8 లేదా మహా అయితే పదిమంది మాత్రమే నిర్మాతలు టాలీవుడ్( Tollywood ) లో ని దొక్క కొని ఈ సినిమాలను చేస్తున్నారు.ఇలా జరుగుతూ పోతే సినిమాలు తీసేవారు సంఖ్య తగ్గుతూ చిన్న సినిమాలను కూడా పట్టించుకోని పరిస్థితులు తలెత్తుతాయి.

వందల సంఖ్యలో వచ్చే సినిమాలు కాస్త 20, 30 కి పడిపోయే అవకాశం ఉంటుంది.

Telugu Demand, Tollywood, Tollywood Heros, Tollywoodheros-Telugu Top Posts

అందుకే సినిమా నిర్మాణం జరిగే ప్రతి చిత్రానికి సంబంధించిన రెమ్యూనరేషన్ తగ్గాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది.ఎందుకంటే నిర్మాణంలో చాలా మట్టుకు పారితోషకాలకి డబ్బు వెళుతుంది.సింహ భాగం అలా వెళ్ళిపోతే మిగిలిన దాంతో సినిమా తీస్తున్నారు.

వందల కోట్లను వెచ్చిస్తూ సినిమా తీస్తున్నప్పుడు హీరోకి 150 కోట్ల పారితోషకం ఇవ్వడం కూడా సబబే అనే పరిస్థితి వస్తున్నప్పటికీ ఇకపై ఆటలు సాగవు అని మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి.ఎంత డిమాండ్ చేసినా కూడా నిర్మాతలంతా ఒకటిగా ఉంటే సినిమా ఇండస్ట్రీని కాస్త కాపాడుకోవచ్చు అనేది చాలామంది అభిప్రాయం.

మరి ఈ మాట మన హీరోలంతా వింటారా లేదా అనేది వేచి చూస్తే కానీ తెలియదు.వారి పారితోషకాన్ని తగ్గించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని నిలబెట్టాల్సిన బాధ్యత మన స్టార్ హీరోలు అందరిపై ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube