ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల క్రీడలు ప్రాచుర్యం పొందాయి.అందులో ముఖ్యంగా ఫుట్బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ ఇలా కొన్ని రకాల క్రీడలు ఎక్కువ ప్రాముఖ్యం చెందాయి.
ప్రపంచంలో అత్యధికంగా ఆడే క్రీడలలో ఫుట్బాల్ మొదటి స్థానంలో ఉంది.ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు( Cricket ) కూడా భారీగా స్పందన లభిస్తోంది.
ఇక భారత దేశంలో క్రికెట్ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు చాలామంది క్రికెట్ చూడటానికి టీవీ ముందు నుంచి కదలరు కూడా.
అంతలా భారతీయులు క్రికెట్ కు అలవాటు పడిపోయారు.ఇక ఈ ఆటను మొదటగా పరిచయం చేసింది బ్రిటిష్ వారు.
![Telugu Cricket, Cricket Ban, Cricket Ground, Cricket Pitch, Europe, Fine, Italy, Telugu Cricket, Cricket Ban, Cricket Ground, Cricket Pitch, Europe, Fine, Italy,](https://telugustop.com/wp-content/uploads/2024/09/This-Italian-town-has-banned-cricket-know-the-reason-detailsa.jpg)
ఆ తర్వాత నెమ్మదిగా ఈ ఆటను ప్రపంచవ్యాప్తం చేశారు.ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందిన మొదటి నాళ్లలో వెస్టిండీస్ ఆధిపత్యం కొనసాగించింది.ఆ తర్వాత అనేక దేశాలు కొత్తగా చేరుతూ క్రికెట్ ను ప్రపంచవ్యాప్తం చేశాయి.ఈ ఏడాది మొదట్లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమ్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ క్రికెట్ కు యూరప్ లో( Europe ) ఉన్న ఓ నగరం మాత్రం నిషేధించింది.ఒకవేళ ఎవరైనా ఈ కట్టుబాటును ఉల్లంఘించి క్రికెట్ ను ఆడడానికి ప్రయత్నిస్తే మాత్రం 100 యూరోలు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 9000 రూపాయలను జరిమానా విధిస్తారు.
![Telugu Cricket, Cricket Ban, Cricket Ground, Cricket Pitch, Europe, Fine, Italy, Telugu Cricket, Cricket Ban, Cricket Ground, Cricket Pitch, Europe, Fine, Italy,](https://telugustop.com/wp-content/uploads/2024/09/This-Italian-town-has-banned-cricket-know-the-reason-detailsd.jpg)
మరి ఆ ప్రాంతం ఏదో తెలుసా.ఇటలీలోని( Italy ) మాన్ఫాల్కోనే నగరంలో( Monfalcone ) ఈ ఆంక్షలు ఉన్నాయి.అయితే ఇందుకు కారణం లేకపోలేదు.నిషేధం ఎందుకని వస్తావిస్తే.అక్కడ క్రికెట్ పిచ్ తయారీకి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమని.పైగా మ్యాచులు నిర్వహణకు ఒక్కో చిన్నపాటి స్టేడియం అయినా కచ్చితంగా అవసరం అవుతుండగా.
అయితే ఆ నగర మున్సిపల్ ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఒకవేళ డబ్బులు ఉన్న స్టేడియం నిర్మాణానికి అవసరమైన భారీ స్థలం కూడా అక్కడ లేదు.
అందుకనే క్రికెట్ పోయి అక్కడ నిషేధం విధించారు.