సాధారణంగా పిల్లలకు గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం.ఈ క్రమంలో పిల్లలు గేమ్స్ ఆడే సమయంలో చాలా చురుగ్గా ఉంటూ మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ ఉంటారు.
ఒక్కోసారి పిల్లలకు సరైన ఆహారం, సరేనా నిద్ర లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.అచ్చం అలాగే ఒక చిన్న పిల్లవాడికి నిద్ర ( Sleep ) తక్కువయిందేమో ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్( Football Match ) ఆడుతూ గ్రౌండ్ లోనే నిలబడి నిద్రపోయాడు.
మిగతా పిల్లలు చురుగ్గా ఫుట్ బాల్ ఆడుతూ ఉంటే ఈ పిల్లవాడు( Little Boy ) మాత్రం నిల్చున్న చోటే నిద్రపోయాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్( Viral ) అవుతున్న వీడియో థాయిలాండ్ లోని ఒక గ్రౌండ్ లో పిల్లలు ఫుట్ బాల్ మ్యాచ్ ను ఆడుతున్నారు.చిన్నపిల్లలు అందరూ కూడా రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఒక పిల్లవాడు చేసే పనికి చూసి నవ్వు ఆగడం లేదు.ఫుట్ బాల్ మ్యాచ్ ఆడే క్రమంలో మిగతా పిల్లలు పరిగెత్తుకుంటూ అటు ఇటు ఆడుతూ ఉంటే.
ఈ పిల్లవాడు మాత్రం అసలు కదలడం లేదు.పైగా నిద్ర మత్తులతో తలను, చేతులను అటు ఇటు కదుపుతూ నిల్చొని ఉన్నాడు.ఇది అంతా ఒక రిఫరర్ గమనించి మందలించాడు.దీంతో ఆ బాలుడు ఆటలోకి వచ్చినట్లే వచ్చి మళ్ళీ వెనక్కు వెళ్లిపోయాడు.దీంతో ఇంకో రిఫర్ నిద్రపోతున్న బాలుడి దగ్గరకు వచ్చి బాలు కోసం వెళ్లమని చెప్పగా అప్పటికి కూడా బాలుడు నుంచి ఎటువంటి స్పందన లేదు.ఆ పిల్లవాడు నిద్రమత్తులోనే అలానే నిద్రపోయాడు.
ఈ సన్నివేశాన్ని మొత్తం అక్కడ చూడడానికి వచ్చినవారు స్మార్ట్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.