ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని,మల్టీ లెవల్ మార్కెటింగ్ ( Multi Level Marketing)ల పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు.జిల్లాలో కొంత మంది ఎలక్ట్రానిక్ షాప్ యజమానులు,వ్యాపారస్తులు మల్టీ లెవల్ మార్కెటింగ్ కి పాల్పడుతూ వివిధ పేర్లతో ప్రజల వద్ద డబ్బులు తీసుకొని రెండు సంవత్సరాలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారాని పోలీస్ శాఖ ( Police Department )దృష్టి కి వచ్చిందని అలాంటి వారి సమాచారం పోలీస్ వారికి అందించాలని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ( SP Akhil Mahajan) మాట్లాడుతూ ప్రజల అమాయకత్వం ఆర్థిక నేరగాళ్ల పట్ల పాలిట వరంగా మారిందని,ఈజీ మనీ/ఫాస్ట్/ క్విక్/ ఇన్ స్టంట్ మనీ (సులువుగా/ ఆయాచితంగా వచ్చే డబ్బు)కు ఆశపడి ఎంఎల్ఎం (మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్) మోసాల భారిన పడి భారీగా నష్టపోతున్నారు.మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ (గొలుసుకట్టు వ్యాపారం)లలో మొహమాటానికి పోయి తెలిసిన వారిని చేర్పించడం ద్వారా సన్నిహితులతో సత్సంబంధాలు దెబ్బతింటయని, ఎంఎల్ఎం స్కీమ్ లలో మోసపోయే వారికి అసలు ఈ స్కీమ్ వెనుక సూత్రధారి ఎవరనే విషయం ఎప్పటికీ తెలియదని,ఈ గొలుసుకట్టు స్కీమ్ లు ఎప్పుడు, ఎక్కడ తెగుతాయో ఎవరికీ తెలియదని,అనుకున్నంత మొత్తంలో డబ్బు రాగానే ఎంఎల్ఎం స్కీమ్ ను నడిపిస్తున్న వారు బోర్డు తిప్పేస్తారని, అందులో చేరిన వారంతా బాధితులుగా మిగిలిపోతారని ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఇస్తామనే ప్రకటనలను నమ్మి మీ కష్టార్జితన్ని కోల్పోవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే సైబర్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి పిర్యాదు చేయాలనీ ఎస్పీ తెలిపారు.