కెనడాలో పంజాబీ సింగర్ ఇంటిపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనే

కెనడాలోని వాంకోవర్‌ విక్టోరియా ద్వీపంలో( Vancouver Victoria Island ) ఫేమస్ పంజాబీ సింగర్ రాపర్ ఏపీ ధిల్లాన్( Punjabi Singer AP Dhillon ) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేపింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని భారత నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.

 Firing Outside Punjabi Singer Ap Dhillon Canada House Lawrence Bishnoi Gang Clai-TeluguStop.com

అయితే ధిల్లాన్ ఇంటిపై కాల్పులకు తమదే బాధ్యత అని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్( Lawrence Bishnoi Gang ) ప్రకటించింది.

Telugu Ap Dhillon, Apdhillon, Canada, Galaxy, Goldy Brar, Lawrencebishnoi, Punja

కెనడియన్ మీడియా నివేదికల ప్రకారం.ధిల్లాన్ ఇంటి వెలుపల ఒక గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరిపాడు.ధిల్లాన్ నిర్వహించిన ఓ కన్సర్ట్‌లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడని అదే బిష్ణోయ్ గ్యాంగ్ ఆగ్రహానికి కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబై బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని( Galaxy Apartment ) సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.దీనిపై దర్యాప్తు జరిపిన ముంబై పోలీసులు ఈ ఘటనకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌లను నిందితులుగా ప్రకటించారు.

Telugu Ap Dhillon, Apdhillon, Canada, Galaxy, Goldy Brar, Lawrencebishnoi, Punja

కాల్పులు జరిగిన సమయంలో ధిల్లాన్ ఇంట్లో ఉన్న ఏకైక వ్యక్తి ఇండో కెనడియన్ రాపర్ షిండా కహ్లాన్‌ పరిస్ధితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.అగంతకుడు మొత్తం 14 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనలో ఒక నల్ల ట్రక్కు, చిన్న వాహనం కాలిపోయాయి.పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఆ ట్రక్ రిపేర్ చేయలేని విధంగా కాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.సోమవారం తెల్లవారుజామున 1.08 గంటలకు ఓ నలుపు రంగు కారు తమ ప్రాంతంలో సంచరించినట్లుగా స్థానికులు అంటున్నారు.కాల్పుల ఘటన తర్వాత ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఆ వీధిని మూసివేశారు.

ఈ ఘటన వెనుక లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

బిష్ణోయ్ గ్యాంగ్‌లో గోల్డీ బ్రార్ కీలక సభ్యుడు.ఇక 80వ దశకం నాటి సింథ్ పాప్‌ని పంజాబీ సంగీతంలో మిక్స్ చేసి ఏపీ ధిల్లాన్ ప్రసిద్ధి చెందారు.

బ్రౌన్ ముండే, ఎక్స్‌క్యూస్‌, సమ్మర్ హై, మ్యాడ్ వంటి పాటలతో పాప్ ప్రపంచంలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube