తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తెలంగాణలో అక్రమంగా ప్రభుత్వ స్థలాలను అలాగే చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉక్కు పాదం మోపుతున్న సంగతి మనకు తెలిసిందే. హైడ్రా ( Hydra ) అధికారులు ఇలా అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నారు.
ఇటీవల సినీ నటుడు నాగార్జునకు ( Nagarjuna ) సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్( N Convention Center ) కూడా చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని అధికారులు కూల్చివేశారు.ఇలా ఈయన కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేసినప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి ఈయనకు మద్దతు లభించలేదు కానీ సోషల్ మీడియా వేదికగా ఇటీవల నాగబాబు ( Nagababu ) చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు.పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో చెరువులు కుంటలు తూములు నిండిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు వస్తున్నాయి.ఇలా నీళ్లు రావడం వల్ల కొన్ని సామాన్య ప్రాణాలు కూడా బలి కావడం బాధాకరం.వీటన్నింటికీ కారణం చెరువులను నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే అని తెలిపారు.
ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్.
ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వారికి సపోర్ట్ చేయాలి.వారికి మనం అండగా నిలబడాలి.పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది.
అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే మనల్ని కచ్చితంగా శిక్షిస్తుంది అంటూ ఈయన పరోక్షంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేయడం కరెక్టేనని చెప్పకనే చెప్పారు.నాగబాబు చేసిన ఈ పోస్ట్ పై మరి కొంతమంది స్పందిస్తూ ఆంధ్రాలో కరకట్టపై కట్టిన ఇల్లు పరిస్థితి ఏంటి, ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టిన హిడెన్ కెమెరాల పరిస్థితి ఏంటి వాటిపై స్పందించావా అంటూ మరికొందరు ఈయన చేసిన పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.