మహేంద్రసింగ్ ధోని.( MS Dhoni ).
ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.టీమిండియా క్రికెట్లో ఎవరికి సాధ్యం కానీ అనేక పనులను చేసి పెట్టాడు మహేంద్ర సింగ్ ధోని.
ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లో విజయాన్ని అందుకున్న ఏకైక కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు.కేవలం కెప్టెన్ గామాత్రమే కాకుండా.ఆయన వ్యక్తిత్వంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి ధోని.తాను క్రికెట్ ఆడడమే కాకుండా ఎంతో మంది యువ క్రికెటర్లను కూడా వెలుగులోకి తీసుకోవచ్చారు.
అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగ రాజ్ సింగ్( Yograj Singh ) మరోసారి విమర్శలు గుప్పించారు.
ఇందులో భాగంగా యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.ధోని వల్లే తన కొడుకు యువరాజ్ సింగ్ క్రికెట్ కెరియర్ మధ్యలోనే ముగిసిందని పలు వ్యాఖ్యలు చేశాడు.అలాగే ధోని గురించి మాట్లాడుతూ.ధోని అద్భుతమైన లెజెండ్ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని.కాకపోతే., తన కొడుకు కెరియర్ ని నాశనం అవ్వడానికి కారణం మాత్రం ఆయనేనంటూ అతని నేను ఎప్పటికీ క్షమించమని చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ ( Yuvraj Singh )తన అంతర్జాతీయ క్రికెట్ మరో నాలుగు ఐదు సంవత్సరాలు పాటు ఆడేవాడని.కాకపోతే ధోని కారణంగా యువరాజ్ సింగ్ అర్ధాంతరంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ముగించినట్లు చెప్పుకొచ్చాడు.
ధోని సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ తాను తన కుటుంబ సభ్యులు తప్పు చేసిన వారిని ఎప్పటికీ క్షమించను అని మాట్లాడారు.ఇక యువరాజ్ సింగ్ క్యాన్సర్ తోనే పోరాడుతూనే తన దేశానికి వరల్డ్ కప్ అందించినందుకు అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు యువరాజ్ సింగ్ తండ్రి.
ఇదివరకు కూడా ధోనిపై ఆయన పలు వ్యాఖ్యలు చేశాడు.ఇదిలా ఉండగా.
టీమిండియా 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున 42 మ్యాచులు ఆడి అందులో 17 సెంచరీలు 71 అర్ధ సెంచరీలు సాధించాడు.