చాలామంది దర్శకులు తమ సినిమాల కథలకు సరిగ్గా సూట్ అయ్యే టైటిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు.“అమ్మో ఒకటో తారీకు”, “ఏప్రిల్ ఒకటి విడుదల”, “మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది”, “అంధగాడు” ఇలా తెలుగులో చాలా మంచి టైటిల్స్‌తో సినిమాలు వచ్చాయి.ఈ టైటిల్స్ అనేవి సినిమా కథను బాగా జస్టిఫై చేస్తాయి.టైటిల్స్ ప్రేక్షకులకు నచ్చేలాగా, ఆప్ట్‌గా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.అప్పుడే చాలామంది ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోగలదు.చాలామంది దర్శకులు టైటిల్ వినగానే ఆ మూవీ జానర్ ఏంటో తెలిసేలాగా కూడా జాగ్రత్త పడతారు.
కానీ కొందరు టాలీవుడ్ డైరెక్టర్లు తమ సినిమాల కథలకు, అసలు ఏమాత్రం సంబంధం లేకుండా టైటిల్స్ పెట్టారు.అవి ఫెయిలయ్యాయి.అవి ఏవో చూద్దాము.
• సారొచ్చారు
రవితేజ, పరశురామ్ కాంబోలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా “సారొచ్చారు”( Sarocharu ) అట్టర్ ఫ్లాప్ అయింది.ఈ సినిమా కథ వరస్ట్‌గా ఉంటుంది.అంతేకాదు ఈ మూవీకి, కథకి ఏ లింక్ ఉండదు.“మంచి ప్రేమ కథతో” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వచ్చింది.కానీ దాన్ని సినిమా టైటిల్ జస్టిఫై చేయలేకపోయింది.
• స్పైడర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా , మురుగ దాస్ డైరెక్ట్ చేసిన “స్పైడర్” సినిమా( Spyder ) ఫెయిల్ అయింది.మహేష్ బాబు ఈ మూవీ టైటిల్ ని ఎలా ఒప్పుకున్నారో తెలియదు కానీ దీనికి, కథకు ఎలాంటి సంబంధం ఉండదు.మురుగదాస్ ఇంత పెద్ద ఫ్లాప్ ఇచ్చిన తర్వాత టాలీవుడ్ లో కనిపించకుండా పోయాడు.
• ఐస్‌క్రీమ్
రామ్ గోపాల్ వర్మ డైరెక్టోరియల్ “ఐస్‌క్రీమ్”( Ice Cream Movie ) టైటిల్ కూడా కథను జస్టిఫై చేయలేదు.ఇందులో నవదీప్, తేజస్వి మదివాడ హీరో హీరోయిన్లుగా నటించారు.ఇది డిజాస్టర్ అయింది.
• బ్రూస్ లీ
రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల తీసిన బ్రూస్ లీ సినిమా( Bruce Lee ) సైతం ఫ్లాప్ అయ్యింది.అయితే ఈ కథకు, టైటిల్ కు ఏ సంబంధమూ ఉండదు.
• ఖలేజా
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన “ఖలేజా” మూవీ( Khaleja Movie ) ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ చిత్రానికి, టైటిల్ కి లింక్ ఉండదు.
• ఛలో
నాగశౌర్య హిట్ మూవీ “ఛలో”కి,( Chalo Movie ) టైటిల్ కు ఎలాంటి లింకు ఉండదు.
• ఆరెంజ్
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన “ఆరెంజ్” సినిమా( Orange Movie ) కథకి, టైటిల్ కి ఎక్కడా కూడా ఎలాంటి సంబంధం ఉండదు.రామ్ చరణ్, జెనిలియా జంటగా వచ్చిన ఈ సినిమా లవ్ స్టోరీస్ చుట్టూ తిరుగుతుంది.ఆరెంజ్ పండు గురించి గానీ అలాంటి పాత్ర గానీ ఇందులో ఏమీ ఉండదు.
రామ్ ఇందులో ఒక గ్రాఫిటీ ఆర్టిస్టు.అతను చాలా కలర్ ఫుల్ ఆర్ట్స్ క్రియేట్ చేస్తుంటాడు.
• రాధేశ్యామ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వచ్చిన “రాధే శ్యామ్”( Radhe Shyam ) ఫ్లాప్ అయ్యింది.ఈ సినిమాకు, టైటిల్ కు ఎలాంటి లింక్ ఉండకపోవడం గమనార్హం.ఇందులో హస్తసాముద్రికుడు విక్రమాదిత్య (ప్రభాస్), డాక్టర్ ప్రేరణ (పూజా) మెయిన్ క్యారెక్టర్స్.రాధే శ్యామ్ అంటే హీరో హీరోయిన్ల పేర్లేమో అని చాలామంది అనుకుంటారు కానీ కాదు.
అసలు ఈ పేర్లకు కథకు సంబంధం ఏంటో ఇప్పటికీ ఎవరూ వెల్లడించలేదు.