గ్రామీణులను పెళ్లి చేసుకోని జపాన్ మహిళలు.. ఆ ప్లాన్ రివర్స్ అయ్యిందా..?

జపాన్‌లో( Japan ) గ్రామీణ ప్రాంతాల్లో మగవారు ఎక్కువగా లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది.అక్కడ అమ్మాయిల కంటే అబ్బాయిలు తక్కువ.

 Japanese Women Who Don't Marry Villagers Has That Plan Reversed , China, Women,-TeluguStop.com

దీని వల్ల ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడం కష్టంగా ఉంది.ఈ సమస్యను పరిష్కరించాలని జపాన్ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.

అది ఏంటంటే, టోక్యోలో( Tokyo ) ఉండే అమ్మాయిలను గ్రామీణ ప్రాంతాలకు పెళ్లి చేసుకోమని పంపించడం.అలా పెళ్లి చేసుకుని గ్రామీణ ప్రాంతంలో స్థిరపడితే వారికి డబ్బు ఇస్తామని, పెళ్లి చేసుకున్నందుకు రైలు టిక్కెట్లు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.

ఇలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు జతకట్టే అమ్మాయిలు దొరుకుతారు అని ప్రభుత్వం భావించింది.

గ్రామీణలను పెళ్లి చేసుకుంటే మహిళలకు 600,000 యెన్ (4,140 డాలర్లు) ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

కానీ ఈ ఆలోచన చాలా మందికి నచ్చలేదు.ఈ విషయం మీడియాలో చాలా చర్చ జరిగింది.

చివరికి ప్రభుత్వం ఈ ప్లాన్‌ను రద్దు చేసింది.

Telugu China, Japanesedont, Rural-Latest News - Telugu

ఈ పథకం గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.చాలా మంది ఈ పథకాన్ని తప్పుగా భావించారు.చాలా మంది ఈ పథకం మహిళలను వస్తువులా చూస్తుందని అన్నారు.

అంటే, అమ్మాయిలను గ్రామాలకు పంపించడానికి డబ్బు ఇస్తున్నారు కాబట్టి, మహిళలను పెళ్లికి ఉపయోగించుకుంటున్నట్లు భావించారు.కొంతమంది ఈ పథకం స్త్రీల స్వాతంత్యానికి వ్యతిరేకమని అన్నారు.

స్త్రీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి కానీ, ఈ పథకం వల్ల స్త్రీలను బలవంతంగా గ్రామాలకు పంపిస్తున్నట్లు అవుతుందని పేర్కొన్నారు.

Telugu China, Japanesedont, Rural-Latest News - Telugu

జపాన్ దేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.కానీ ఈ దేశంలోని గ్రామీణ ప్రాంతాల పెద్ద సమస్యను ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.అది ఏంటంటే, ఆ ప్రాంతాలలో నివసించే యువత, ముఖ్యంగా యువతులు పెద్ద పట్టణాలకు వలస వెళ్తున్నారు.

దీని వల్ల గ్రామాల్లో పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు.కొన్ని చిన్న గ్రామాల్లో అయితే పిల్లలే లేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube