తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జు( Pawan Kalyan, Allu Arju )న్ ప్రముఖంగా అంటారు.వీళ్ళు ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేకెత్తించడమే కాకుండా వాళ్ల ఫ్యాన్స్ కి కూడా వీళ్ళ సినిమాలు కిక్ ని ఇస్తాయనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలు చేసిన మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకొని వీళ్లకు మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టాయి.
అయితే ఇద్దరు హీరోలకు జోడిగా నటించిన నటీమణులు మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలవలేకపోయారు.ఇక పవన్ కళ్యాణ్ ఈవీవీ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి( Akkada Ammayi Ikkada Abbayi ) సినిమా చేశాడు సినిమాతో ఇటు పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైతే అటు అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు అయిన సుప్రియ (Supriya Yarlagadda )హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమైంది.అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీలో మరోసారి హీరోయిన్ గా చేయలేదు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా చేసిన గంగోత్రి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.అల్లు అర్జున్ ఆ సినిమాలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆయన అదితి అగర్వాల్ నటించింది.అయినప్పటికీ ఆమె తర్వాత ఒకటి రెండు చిన్న సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.మొత్తానికైతే ఇద్దరు స్టార్ హీరోలు ఇండస్ట్రీలో పెరుగుతున్నప్పటికీ వాళ్ళు చేసిన మొదటి సినిమా హీరోయిన్స్ మాత్రం రాణించలేకపోవడం విశేషం…ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు…
.