మీకు ప్రాణహానీ .. జాగ్రత్త, నిజ్జర్ అనుచరుడికి కెనడా పోలీసుల హెచ్చరిక

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసు ఇంకా భారత్ – కెనడాలలో ప్రకంపనలు రేపుతూనే ఉంది.ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

 Canadian Police Warn Hardeep Nijjar Aide Inderjeet Singh Gosal Of Threat To Life-TeluguStop.com

దీనికి భారత ప్రభుత్వం సైతం అదే స్థాయిలో కౌంటరిచ్చింది.అయితే నిజ్జర్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు భారతీయ యువకులను కరణ్ బ్రార్ (22), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ ప్రీత్ సింగ్ (28), అమన్‌దీప్ సింగ్ (22)లను కొద్దినెలల క్రితం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Telugu Canada, Canadian, Hardeep Nijjars, Hardeepsingh, Inderjeetsingh, India, T

తాజాగా.హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు సహాయకుడిగా పనిచేసిన ఇందర్‌జీత్ సింగ్ గోసల్‌కు( Inderjeet Singh Gosal ) ప్రాణహాని ఉందని కెనడా పోలీసులు( Canada Police ) హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.గోసల్‌కు ఈవారం “duty to warn” నోటీసును జారీ చేశారు కెనడా పోలీసులు.యూఎస్ ఎఫ్‌బీఐ ఆగస్ట్ 11న నిజ్జర్‌తో సన్నిహిత సంబంధాలున్న కాలిఫోర్నియా కార్యకర్తను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటనను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

దీనిపై ఆర్‌సీఎంపీ లేదా అంటారియో పోలీసులు స్పందించలేదు.కెనడియన్ పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్( Minister Dominic LeBlanc ) కార్యాలయం సైతం ఈ తాజా పరిణామాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Telugu Canada, Canadian, Hardeep Nijjars, Hardeepsingh, Inderjeetsingh, India, T

కాగా.ఈ ఏడాది ఆరంభంలో నిజ్జర్ సన్నిహితుడు సిమ్రంజీత్ సింగ్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం కెనడాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన ప్రభుత్వం, పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.సిమ్రంజీత్ సింగ్‌కు చెందిన సర్రే ఇంటిలో ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో కాల్పులు జరిగాయి.

నాడు .సీబీసీ న్యూస్ ఛానెల్ ప్రకారం.తుపాకీ కాల్పుల్లో ఒక కారు తీవ్రంగా దెబ్బతినగా.

ఇంట్లో పలు బుల్లెట్ రంధ్రాలు వున్నాయి.బ్రిటీష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనీందర్ సింగ్ . సిమ్రంజీత్‌ను నిజ్జర్ సన్నిహితుడిగా పేర్కొన్నారు.నిజ్జర్‌తో వున్న సంబంధాలు ఈ కాల్పులకు కారణమై వుండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి దశలో నిజ్జర్ మరో అనుచరుడు ఇందర్‌జీత్ సింగ్‌కు ప్రాణహాని ఉందంటూ పోలీసులు హెచ్చరించడం కెనడాలో చర్చనీయాంశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube