సాధారణంగా కొందరి జుట్టు చాలా పల్చగా ఉంటుంది.ఆడవారే కాదు మగవారు కూడా పల్చటి జుట్టు కారణంగా బాధపడుతుంటారు.
కురులు పల్చగా ఉండటం వల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ సెట్ అవ్వవు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా( Thick Hair ) మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ టానిక్ ను వాడటం వల్ల నెల రోజుల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek ) నాలుగు నుంచి ఐదు మందారం పువ్వులు( Hibiscus Leaves ) మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి ఉడికించాలి.వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించి.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అనంతరం స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్( Hair Tonic ) రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ హోమ్ మేడ్ టానిక్ ను కనుక వాడితే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.
అలాగే హెయిర్ ఫాల్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.జుట్టు విరగడం చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.
కురులు దృఢంగా మరియు ఆరోగ్యంగా మారతాయి.కాబట్టి ఒత్తైన జుట్టును కోరుకుంటున్నవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.