సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు కొనసాగుతూ ఉన్నారు.అయితే మంచు వారసులుగా ఇప్పటికే విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న కొనసాగుతున్నారు.
ఇకపోతే తాజాగా మంచు విష్ణు( Manchu Vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమా( Kannappa Movie ) ద్వారా మంచు మూడోతరం వారసుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.కన్నప్ప సినిమా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మంచు విష్ణు ఎన్నో సందర్భాలలో తెలియజేశారు అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకుంటుంది.
ఈ సినిమా ద్వారా మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా కోసం వివిధ భాషలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరినీ కూడా భాగం చేశారు.దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.సినిమాలో శివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించబోతున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్( Avram ) కూడా నటిస్తున్నారు.
తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు .ఇక ఈ పోస్టర్ ను మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కృష్ణాష్టమి శుభాకాంక్షలని తెలియజేశారు.అయితే మంచు విష్ణు తన కొడుకు మొదటి సినిమా పోస్టర్ పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఈ పోస్టర్‌ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు నాకు మాటలు రావడం లేదు అని ఎమోషన్‌ల్ అయ్యాడు.
ఇక ఆవ్రామ్ తిన్నడు పాత్రలో నటిస్తున్నారు.తిన్నడు పెద్దయ్యాక కన్నప్పగా మారతారు.
దీంతో మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో తన కొడుకు ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.