న్యూయార్క్ మ్యూజియం ఫ్లోర్‌పై షూ వదిలిన యువతి.. నెక్స్ట్ ఏమైందో చూస్తే నవ్వేనవ్వు!

మ్యూజియంలలో( Museum ) చరిత్ర, శాస్త్రం, కళలు లేదా సంస్కృతికి సంబంధించిన పాత వస్తువులు, చిత్రాలు మొదలైన వాటిని జాగ్రత్తగా ఉంచుతారు.వాటిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఈ మ్యూజియంలకు వస్తుంటారు.

 Woman Keeps A Shoe On New York Museum Floor And Then This Happened Viral Video D-TeluguStop.com

అయితే, న్యూయార్క్‌లోని( New York ) ఒక మ్యూజియంలో ఓ యువతి విజిటర్లను ఫూల్స్ చేసింది.ఆమె మ్యూజియం ఫ్లోర్‌పై షూ( Shoe ) ఉంచి కొద్దిగా దూరంగా వెళ్లిపోయింది.

అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ బూటు ఏదో పాత కాలపు విలువైన వస్తువు అనుకుని చాలా ఆశ్చర్యపోయారు.అంతేకాదు, దాన్ని చాలా జాగ్రత్తగా ఫొటోలు తీసుకున్నారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఒక మాములు షూ చూసి వీళ్లు ఇచ్చిన రియాక్షన్లు చూసి సోషల్ మీడియా యూజర్లు తెగ నవ్వుకుంటున్నారు.న్యూయార్క్‌లోని ప్రముఖ గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో( Guggenheim Museum ) ఒక ఫన్నీ సంఘటన జరిగింది.ఆ యువతి కేవలం ఒక కన్వర్స్ షూ వేసుకొని మ్యూజియంలో తిరుగుతుంది.

కెమెరా తిప్పగానే, ఖాళీ గది మూలలో ఉంచిన మరొక బేజ్ రంగు షూ కనిపిస్తుంది.దాన్ని ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నట్లు మనం చూడవచ్చు.అది ఏదో పాత కాలపు విలువైన వస్తువు అనుకుని, 3-4 మంది వాళ్ల ఫోన్లలో ఫోటోలు కూడా తీసుకున్నారు.

“న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంకి వెళ్లిన ఒక అమ్మాయి తన షూ తీసి ఎగ్జిబిషన్ వస్తువుల దగ్గర పెట్టింది.ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ షూ చూసి ఫొటోలు తీసుకుంటూ నిలబడ్డారు.” అని ఈ వీడియో పోస్ట్‌కు ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియోకు ఇంటర్నెట్‌లో 2 కోట్ల 31 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన వాళ్లు కొందరు దీన్ని చాలా ఫన్నీగా భావించారు, మరికొందరు ఆ వస్తువులో కళను చూడాలని ప్రయత్నించారు.

కళ అంటే ఆలోచింపజేయడం, భావోద్వేగాలను రేకెత్తిస్తూ, ప్రతిబింబించేలా చేయడం అని అంటారు.ఈ ట్రిక్ చేసిన వ్యక్తి కళాకారుడు అని, ఆ మ్యూజియం వాతావరణాన్ని మార్చేశాడు అని కొంతమంది అన్నారు.

ఇదొక తెలివైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ అని ఒకరు కామెంట్ చేయగా ప్రజలు ఎలాంటి వస్తువులోనైనా ఆర్ట్ ని చూడగలరు అని మరొకరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube