యూఎస్ రెస్టారెంట్‌లో చేదు అనుభవం.. బలవంతంగా రూ.420 టిప్ కట్టించారు..?

అమెరికాలోని చాలా రెస్టారెంట్లలో, వెయిటర్‌లు లేదా వెయిట్రెస్‌లకు వారి సర్వీసుకు గుర్తుగా కొంత మొత్తం ఇవ్వడం కామన్.దీన్నే టిప్పింగ్( Tipping ) అంటారు.

 Indian Guy In The Us Who Paid Rs 420 Tip Calls Tipping A Scam Details, Tipping,-TeluguStop.com

అయితే ఇటీవల ఒక బెంగళూరు వ్యక్తి అమెరికాలోని ఒక న్యూయార్క్ రెస్టారెంట్‌లో( Newyork Restaurant ) తిన్న భోజనానికి 50 డాలర్లు ఇచ్చాడు.నిజానికి అతడి బిల్లు 45 డాలర్లు అయింది.50 డాలర్లు ఇచ్చిన తర్వాత ఐదు డాలర్లు తిరిగి ఇస్తారేమో అని అనుకున్నాడు.కానీ, ఆయనకు 5 డాలర్లు (సుమారు రూ.420) చేంజ్ ఇవ్వలేదు.వెయిటర్( Waiter ) ఆ మిగిలిన డబ్బును టిప్‌గా తీసుకున్నారు.

ఈ బెంగళూరు వ్యక్తి పేరు ఇషాన్ శర్మ.( Ishan Sharma ) యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు.

అతడు యూఎస్ రెస్టారెంట్‌లో తన దగ్గర నుంచి బలవంతంగా టిప్ తీసుకున్నట్టు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో తెలిపాడు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.చాలామంది ఈ టిప్పింగ్ వ్యవస్థను అన్యాయమని అంటున్నారు.కొందరు మాత్రం, వెయిటర్‌ల జీతాలు తక్కువగా ఉండటం వల్ల టిప్పింగ్ అనేది అవసరం అని వాదిస్తున్నారు.

ఇషాన్ శర్మ సోషల్ మీడియా పోస్ట్‌లో అక్కడ జరిగిన కన్వర్జేషన్ గురించి తెలిపాడు.టిప్పు కంపల్సరీ ఇవ్వాలా అని అడిగితే ఆ వెయిట్రెస్‌ తనకు కనీసం ఆన్సర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన స్నేహితుడు (స్థానికుడు) తాను ఇలా అడగడం చూసి చాలా ఇబ్బంది పడ్డాడట.“నా ఫ్రెండ్ కనీసం 20% టిప్ ఇవ్వకపోతే తప్పు చేసినట్లు భావించాడు!” అని మరింత వివరించాడు.“అసలు 20% ఎందుకు కట్టాలి?” అని ఈ యువకుడు ప్రశ్నిస్తూ, టిప్పింగ్ వ్యవస్థను “ఇన్‌సేన్”గా అభివర్ణించారు.

ఆ పోస్ట్‌ను ఆగస్టు 20న పంచుకున్నప్పటి నుంచి, దానికి 5.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనేక కామెంట్స్ వచ్చాయి.‘అమెరికా గురించి నాకు తెలియదు, కానీ టిప్స్ కృతజ్ఞతగా ఇవ్వాలి, బలవంతంగా కాదు’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.’15-20% టిప్ ఇవ్వడం అమెరికాలో కామన్ సోషల్ ప్రాక్టీస్. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్ల వలె ప్రవర్తించాలి.టిప్పింగ్ తప్పు అని మీకు బలంగా అనిపిస్తే, సిట్-డౌన్ రెస్టారెంట్‌లో ఆహారం ఆర్డర్ చేయకండి’ అని ఇంకొకరు అన్నారు.“మీరు కేవలం 10% టిప్ ఇచ్చి తప్పించుకున్నారు.ఈ రోజుల్లో కనీసం 15-20% లేదా అంతకంటే ఎక్కువ టిప్ ఇవ్వడం సాధారణం అయింది” అని మరొకరు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube