ఎంబీబీఎస్ ప్రవేశాలు.. ఎన్ఆర్ఐ కోటా నిబంధనల్ని సవరించిన పంజాబ్ సర్కార్

మెరుగైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న విద్యాసంస్థలు, తక్కువ ఫీజులు తదితర అంశాలతో భారతదేశంలో చదువుకునేందుకు వస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతోంది.ఇప్పటి వరకు భారతీయులే ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్తుంటే.

 Mbbs Admissions Punjab Govt Amends Nri Quota Norms, Medical Education And Res-TeluguStop.com

ఇప్పుడు విదేశీయులే మనదేశానికి వస్తుండటం శుభపరిణామం.అందుకు తగినట్లుగా ఆయా విద్యాసంస్థలు, ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి.

తాజాగా పంజాబ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్( Medical Education and Research ) విభాగం (డీఎంఈఆర్) మంగళవారం ఎన్ఆర్ఐ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లకు అర్హత ప్రమాణాలను సవరించింది.

Telugu Mbbs, Nri Quota, Punjab-Telugu Top Posts

దీని ప్రకారం .ఏదైనా ఎన్ఆర్ఐ కోటా సీటు ఖాళీగా ఉంటే.అది ప్రభుత్వ కళాశాలలో జనరల్ కేటగిరీ సీటుగా, ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ సీటుగా మార్చబడుతుంది.

ఈ ప్రమాణాల తర్వాత చాలా తక్కువ సంఖ్యలోనే ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఖాళీ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ నిర్ణయం జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు మింగుడు పడటం లేదు.

పంజాబ్‌( Punjab )లోని 10 మెడికల్ కాలేజీల్లోని మొత్తం 1,550 ఎంబీబీఎస్ సీట్లలో 183 సీట్లు ఎన్ఆర్ఐ అభ్యర్ధులకు రిజర్వ్ చేశారు.గడిచిన సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐ సీట్లు ఖాళీగా ఉండటంతో జనరల్ కేటగిరీ విద్యార్ధులకు సులభంగా ప్రవేశాలు దొరికేవి.

Telugu Mbbs, Nri Quota, Punjab-Telugu Top Posts

గతేడాది రాష్ట్రంలో మొత్తం 183 ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లలో 148 సీట్లు ఖాళీగా ఉండగా.వీటిని జనరల్ కేటగిరీ అభ్యర్ధులతో భర్తీ చేశారు.ఈ 148 సీట్లలో 57 సీట్లు నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 9న డీఎంఈఆర్ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ప్రకారం ఎన్ఆర్ఐలు లేదా ఎన్ఆర్ఐల పిల్లలు. పంజాబ్ మూలాలున్న వారు.

ఎన్ఆర్ఐ కోటా సీట్లకు అర్హులు.సీట్లు ఖాళీగా ఉన్నపక్షంలో భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు లేదా ఎన్ఆర్ఐల పిల్లలు ఈ సీట్లకు అర్హులు.

రాష్ట్ర వైద్య సంస్థలకు అత్యధిక సంఖ్యలో ఎన్ఆర్ఐ విద్యార్ధులను ఆకర్షించేందుకు నోటిఫికేషన్‌లో పాక్షిక సవరణ చేసినట్లు డీఎంఈఆర్ కార్యదర్శి ప్రియాంక్ భారతి( Priyank Bharti ) తెలిపారు.ఈ కేటగిరీ కింద మరిన్ని సీట్లను భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్‌లను సవరించాలని వైద్య కళాశాలలు, ప్రత్యేకించి ప్రైవేట్ విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని డీఎంఈఆర్ వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి, వైద్య కళాశాలలు కొన్నేళ్లుగా ఎన్ఆర్ఐల అర్హతా ప్రమాణాలను సడలించాలని కోరుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube