అభిమాని గుండెపై ఆటోగ్రాఫ్.. రానా మంచి మనసుకు ఫిదా అవ్వాల్సిందే!

లీడర్ సినిమా( Leader Movie ) ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు రానా దగ్గుబాటి( Rana Daggubati ) .మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా అనంతరం వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

 Rana Sweet Gesture Towards A Fan At Chicago Video Viral Details,rana, Rana Autog-TeluguStop.com

ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా పాత్ర కథ నచ్చితే విలన్ పాత్రలలో కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడరు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రానా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.

పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోగా అడుగు పెట్టినప్పటికీ ఈయన మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.అయితే ప్రస్తుతం తన భార్యతో కలిసి అమెరికా( America ) వెకేషన్ లో ఉన్నటువంటి రానాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఈ హీరో అభిమానులను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకొని వారితో సరదాగా ఫోటోలు దిగుతూ వారికి ఆటోగ్రాఫ్( Autograph )లు కూడా ఇస్తూ ఉంటారు అయితే అమెరికాలో ఈయన కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఈయన అభిమాని ఒకరు తనని గుర్తించారు.

ఈ విధంగా ఆ అభిమాని రానానీ పలకరించడంతో రానా కూడా హాయ్ చెప్పడమే కాకుండా కారు ముందు ఆపుతా రమ్మని చెప్పారు.ఇంకేముంది కారు ఆపగానే అతను రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు.రానా కూడా తన ఫ్యాన్‌తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా పలకరించి ఫొటోలు ఇచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఆ అభిమాని ఏకంగా తన గుండెపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరారు.

రానా వద్దని చెప్పిన వినకుండా ఆ అభిమాని తన షర్టుపై ఆటోగ్రఫీ ఇప్పించుకోవడమేకాకుండా తన కారుపై కూడా రానా ఆటోగ్రాఫిక్ తీసుకొని తన సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవడంతో అభిమానులు కూడా ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube