అభిమాని గుండెపై ఆటోగ్రాఫ్.. రానా మంచి మనసుకు ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
లీడర్ సినిమా( Leader Movie ) ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు రానా దగ్గుబాటి( Rana Daggubati ) .
మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా అనంతరం వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా పాత్ర కథ నచ్చితే విలన్ పాత్రలలో కూడా నటించడానికి ఏమాత్రం వెనకాడరు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రానా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.
"""/" /
పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోగా అడుగు పెట్టినప్పటికీ ఈయన మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు.
అయితే ప్రస్తుతం తన భార్యతో కలిసి అమెరికా( America ) వెకేషన్ లో ఉన్నటువంటి రానాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఈ హీరో అభిమానులను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకొని వారితో సరదాగా ఫోటోలు దిగుతూ వారికి ఆటోగ్రాఫ్( Autograph )లు కూడా ఇస్తూ ఉంటారు అయితే అమెరికాలో ఈయన కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఈయన అభిమాని ఒకరు తనని గుర్తించారు.
"""/" /
ఈ విధంగా ఆ అభిమాని రానానీ పలకరించడంతో రానా కూడా హాయ్ చెప్పడమే కాకుండా కారు ముందు ఆపుతా రమ్మని చెప్పారు.
ఇంకేముంది కారు ఆపగానే అతను రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు.
రానా కూడా తన ఫ్యాన్‌తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా పలకరించి ఫొటోలు ఇచ్చారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఆ అభిమాని ఏకంగా తన గుండెపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరారు.
రానా వద్దని చెప్పిన వినకుండా ఆ అభిమాని తన షర్టుపై ఆటోగ్రఫీ ఇప్పించుకోవడమేకాకుండా తన కారుపై కూడా రానా ఆటోగ్రాఫిక్ తీసుకొని తన సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవడంతో అభిమానులు కూడా ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!