టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటి సంగీత( Sangeetha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సంగీత పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఖడ్గం.
ఈ సినిమాతో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాటు, భారీగా అభిమానులను కూడా సంపాదించుకుంది.ఈ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఖడ్గం చిత్రంలో( Khadgam Movie ) పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు.
అలాంటి సంగీత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.తెలుగునే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించిన ఈమె గాయకుడు క్రిష్ ను( Singer Krish ) ప్రేమిచి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కాగా వీరికి ఒక కూతురు కూడా ఉంది.
వివాహాం అనంతరం గుణ చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని తెలిపారు.కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందని ఆమె అన్నారు.
తనకు తమిళంలో నటించడం ఇష్టం లేదు అంటే తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చని అయినా తాను నిజమే చెబుతున్నానని ఆమె అన్నారు.కోలీవుడ్ లో( Kollywood ) నటించేటప్పుడు సరైన మర్యాద ఉండదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సంగీత.నిజం చెప్పాలంటే తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది కూడా లేదని ఆమె అన్నారు.ఎందుకంటే తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు.అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్ చేసినా, వారు మర్యాద లేకుండా మాట్లాడతారని ఆమె అన్నారు.
వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారని అన్నారు.తన పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అన్నట్లు వారు మాట్లాడతారు అని సంగీత తెలిపింది.
తనకు తమిళ చిత్ర పరిశ్రమలో మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.కాగా సంగీత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసింది.
ఆమెతో ఎవరు అలా ప్రవర్తించి ఉంటారు అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.