ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి, జైలుకు వెళ్లి దాదాపు 6 నెలలు అవుతోంది. ఈ ఏడాది మార్చి 15న కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు .బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నించినా లభించలేదు. ఈరోజు మరోసారి కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.దీంతో ఈ విచారణలో కవితకు బెయిల్ లభిస్తుందా లేదా అనేది కల్వకుంట్ల కుటుంబంతో పాటు బిఆర్ఎస్ నేతలు కూడా ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ , సిబిఐ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనేకసార్లు కవిత ట్రైల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసినా, ఫలితం దక్కలేదు .ఇదే కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోసియా కి బెయిల్ లభించడంతో , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్( Arvind Kejriwal ) కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.కవిత కూడా మద్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది అయితే కవిత అనారోగ్య కారణాలు దృష్ట్యా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
గత పది రోజులుగా కవిత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయ నిపుణులతో చర్చించారు.కవితకు బెయిల్ వస్తుందని ఆశతో కేటీఆర్ ఉన్నారు.
దాదాపు 6 నెలల నుంచి కవిత తీహార్ జైలులోనే ఉండడంతో ఆమెకు కచ్చితంగా ఇప్పుడు బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈడీ , సిబిఐ లు మాత్రం కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో కవిత బెయిల్ వస్తుందా లేదా అనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది.