ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో టిడిపి, జనసేన , బిజెపి ( TDP, Jana Sena, BJP )నాయకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.ఈ పోస్టుల భర్తీలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఉన్న పదవి దక్కబోతోంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
గత కొద్ది రోజులుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై కసరత్తు జరుగుతుంది.జనసేన , బిజెపికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యం కల్పించబోతుండడంతో, ఆ రెండు పార్టీల్లోని నేతలు ఆ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఒక ప్రత్యేక ఫార్మేట్ ను రూపొందించి దానికి అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) కసరత్తు చేస్తున్నారు.రోజురోజుకు పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య పెరిగిపోతుంది.
ఇదిలా ఉంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అధిష్టానం సూచన మేరకు సీట్లు త్యాగం చేసిన నేతలు ఈ పదవులపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో వారికే మొదట ప్రాధాన్యం ఇస్తామనే లీకులు ఇవ్వడంతో , వారు ఈ పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.మిత్ర పక్షాలకు కేటాయించిన 31 స్థానాల్లో ముందుగా పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది .వీరితో పాటు 11చోట్ల వైసిపి అభ్యర్థులు విజయం సాధించిన చోట పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్ళగలిగిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఈ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు.ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెనాలి అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో అక్కడ టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా( Former minister Alapati Raja ) తన సీటును త్యాగం చేసి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు ఆ సీటును అప్పగించారు.దీంతో ఆయనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ఆర్టిసి చైర్మన్ లేదా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, ఎఐసిసి పదవులలో ఏదో ఒకటి కేటాయిస్తారని తెలుస్తోంది.అలాగే పెదకూరపాడు స్థానాన్ని ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం .గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే అక్కడ ఇన్చార్జిగా ఉన్న కోవెలమూడి నానినీ కాదని బీసీ మహిళ గల్లా మాధవికి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.దీంతో నానికి నామినేటెడ్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.
మొదటి విడత నామినేటెడ్ పదవుల్లో తమకే అవకాశం ఇస్తారని టికెట్ ఆశించి బంగపడిన టిడిపి నేతలు ఆశలు పెట్టుకోగా, మొదటి విడతలో తమకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని జనసేన , బిజెపి నాయకులు ఆశాభావంతో ఉన్నారు.