ఆ ఒక్క పని చేస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ కు హిట్లు.. మారాల్సిన తరుణం ఆసన్నమైందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు( Puri Jagannadh ) పేరు ఉంది.ఒకప్పుడు వరుసగా భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుడు గత కొన్ని ఇళ్లలో టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మాత్రమే విజయాలను అందుకున్నారు.

 This Is The Time For Change In Puri Jagannath Details, Puri Jagannadh, Director-TeluguStop.com

ఈ మధ్యకాలంలో పూరీ జగన్నాథ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలతో నిరాశ పరిచారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ( Double Ismart Movie ) కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి.

దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమాలలో కథలను గాలికొదిలేసి కేవలం హీరోయిజంపై దృష్టి పెట్టి తన సినిమాలు ఫ్లాప్ కావడానికి పరోక్షంగా కారణం అవుతున్నారు.లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఆర్థికంగా కూడా పూరీ జగన్నాథ్ కు నష్టాలను మిగిల్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu Puri Jagannadh, Double Ismart, Ismart Shankar, Liger, Purijagannadh, Temp

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇతర రైటర్ల కథలతో సినిమాలను తెరకెక్కిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంది.ఒకే తరహా కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడం వల్లే పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వక్కంతం వంశీ( Vakkantam Vamshi ) కథ అందించిన టెంపర్( Temper ) ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కిస్తే ఆయన ఖాతాలో మరిన్ని విజయాలు చేరుతాయి.

భారీ సక్సెస్ దక్కే వరకు తన సినిమాల బడ్జెట్ల విషయంలో సైతం పూరీ జగన్నాథ్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Telugu Puri Jagannadh, Double Ismart, Ismart Shankar, Liger, Purijagannadh, Temp

దర్శకుడు పూరీ జగన్నాథ్ లో మార్పు వస్తే ఆయనకు భారీ విజయాలు దక్కడానికి ఎంతో సమయం పట్టదు.వింటేజ్ పూరీ జగన్నాథ్ కావాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ సోలో మూవీ గా విడుదలై ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండేవని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube