మచ్చలను మాయం చేసి మెరిసే చర్మాన్ని అందించే బొప్పాయి.. ఎలా వాడాలంటే!

ముదురు రంగు మచ్చలతో ముఖం అసహ్యంగా కనిపిస్తుందా.? స్పాట్ లెస్ స్కిన్ కోసం ఆరాటపడుతున్నారా.? మచ్చలను వదిలించుకునేందుకు రకరకాల చర్మ ఉత్పత్తులను వాడి విసుగు చెందారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చర్మ సమస్యల‌ను దూరం చేయడంలో అందాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి.ముఖ్యంగా బొప్పాయి పండు మచ్చలను( Papaya fruit spots ) మాయం చేసి మెరిసే చర్మాన్ని అందించగలదు.అందుకోసం బొప్పాయి పండును ఎలా వాడాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

 Papaya Removes Blemishes And Gives Glowing Skin! Papaya, Blemishes, Glowing Skin-TeluguStop.com

ముందుగా ఒక కలబంద ఆకు ( Aloe vera leaf )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే పావు కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్( Aloe vera gel ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న బొప్పాయి అలోవెరా మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పౌడర్ ( Oats powder )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Blemishes, Skin, Latest, Papayablemishes, Skin Care, Skin Care Tips

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.చివరిగా వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Telugu Tips, Blemishes, Skin, Latest, Papayablemishes, Skin Care, Skin Care Tips

బొప్పాయి, అలోవెరా, ఓట్స్.ఇవి మూడు చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.చర్మంపై ముదురు రంగు మచ్చల‌ను క్రమంగా దూరం చేస్తాయి.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపిస్తాయి.అలాగే బొప్పాయి స్కిన్ ఏజింగ్‌ ను ఆలస్యం చేస్తుంది.ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా మెరిసేలా చేస్తుంది.

అలోవెరా జెల్ స్కిన్ ను హైడ్రేట్ గా ఉంచుతుంది.ఓట్స్ చర్మ కణాలను లోతుగా శుభ్రం చేస్తుంది.

హెల్తీ అండ్ షైనీ స్కిన్ ను అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube