డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తో లైగర్ నష్టాలు భర్తీ కానున్నాయా.. అన్ని రూ.కోట్లు ఇవ్వనున్నారా?

మరో 48 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ ( Double iSmart )బాక్సాఫీస్ వద్ద ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

 Double Ismart Makers Comments About Liger Losses Details Inside Goes Viral In S-TeluguStop.com

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయి.

Telugu Double Ismart, Liger, Bachchan, Puri Jagannadh-Movie

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తో లైగర్ నష్టాలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.లైగర్( Liger ) తో నష్టపోయిన బయ్యర్లకు 40 శాతం నష్టాలను భర్తీ చేయడానికి అంగీకారం కుదిరిందని భోగట్టా.ఈ వివాదం సద్దుమణగడంతో పూరీ జగన్నాథ్ పై ఒత్తిడి తగ్గిందని చెప్పవచ్చు.

సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డబుల్ ఇస్మార్ట్ క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు.

Telugu Double Ismart, Liger, Bachchan, Puri Jagannadh-Movie

అయితే ఇండిపెండెన్స్ డే కానుకగా ఏకంగా 4 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో 4 సినిమాలు థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుంది.ఈ నెల 14వ తేదీ నుంచి మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan )సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం కానుండగా డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్రం ఈ నెల 15వ తేదీ నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.రామ్( Ram Pothineni ) కెరీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా డబుల్ ఇస్మార్ట్ తో ఆ లోటు తీరుతుందేమో చూడాలి.

ఈ మధ్య కాలంలో రామ్ వరుసగా మాస్ సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుండటం గమనార్హం.రామ్ ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది.6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం నష్టాలను భర్తీ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube