డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తో లైగర్ నష్టాలు భర్తీ కానున్నాయా.. అన్ని రూ.కోట్లు ఇవ్వనున్నారా?

మరో 48 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ ( Double ISmart )బాక్సాఫీస్ వద్ద ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండనున్నాయి.

"""/" / డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తో లైగర్ నష్టాలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది.

లైగర్( Liger ) తో నష్టపోయిన బయ్యర్లకు 40 శాతం నష్టాలను భర్తీ చేయడానికి అంగీకారం కుదిరిందని భోగట్టా.

ఈ వివాదం సద్దుమణగడంతో పూరీ జగన్నాథ్ పై ఒత్తిడి తగ్గిందని చెప్పవచ్చు.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డబుల్ ఇస్మార్ట్ క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు.

"""/" / అయితే ఇండిపెండెన్స్ డే కానుకగా ఏకంగా 4 సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో 4 సినిమాలు థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 14వ తేదీ నుంచి మిస్టర్ బచ్చన్ ( Mr Bachchan )సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం కానుండగా డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్రం ఈ నెల 15వ తేదీ నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

రామ్( Ram Pothineni ) కెరీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా డబుల్ ఇస్మార్ట్ తో ఆ లోటు తీరుతుందేమో చూడాలి.

ఈ మధ్య కాలంలో రామ్ వరుసగా మాస్ సినిమాలలో నటిస్తున్నా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తుండటం గమనార్హం.

రామ్ ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది.6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం నష్టాలను భర్తీ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం మరోసారి సాహసం చేయబోతున్న ఎన్టీఆర్?