ఒక సినిమా తీయాలి అంటే అంత ఆషామాసి వ్యవహారమైతే కాద.సినిమాల మీద దర్శకుడు కి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి.
అలాగే కథ కూడా జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి.అలాంటప్పుడు మాత్రమే సినిమాని చాలా సక్సెస్ ఫుల్ గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది.
మరి ఇలాంటి క్రమంలో చాలామంది దర్శకులు సినిమాల మీద ఫోకస్ చేసినప్పటికీ స్టోరీల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సినిమాలన్నీ ప్లాప్ అవుతూ ఉంటాయి.ఇక కొన్ని సినిమాలు అయితే చూడ్డానికి బాగున్నప్పటికీ ప్రేక్షకులను కూడా అలరిస్తాయి.
కానీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటాయి.
అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.ఇక మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ ( Guntur Karam )సినిమా చూసే ప్రేక్షకులను ఎంగేజ్ చేసినప్పటికీ ఆ సినిమా రొటీన్ రొట్టె ఫార్ములా లో ఉందనే ఉద్దేశ్యంతోనే ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.ఇక మొత్తానికి అయితే ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.
కానీ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం బోర్ లేకుండా సినిమా సాగడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే త్రివిక్రమ్( Trivikram ) ట్రీట్ మెంట్ లో ఏ మాత్రం కొత్తదనం లేకుండా రోటీన్ గా రాశాడు.
కొంచెం వైవిధ్యం చూపించిన కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేదని సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో కమర్షియల్ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు.అయినప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం తను చాలా వరకు తప్పటడుగు వేసినట్టుగా తెలుస్తుంది…