సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త..ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త.సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం… సైబర్ నేరాలకు చెక్ పెడుదాం.

 Tasmat Sp Akhil Mahajan Cautions Against Cyber Crime , Cyber Crime , Sp Akhil M-TeluguStop.com

సైబర్ నేరాలకు గురైనవారు ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయండి.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటూ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ,సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

మన బలహీనతనే సైబర్ నేరగాళ్ల బలం అని తక్కువ సమయంలో డబ్బులు సంపాదన, వ్యక్తి గత విషయాలు పంచుకోవడం ,మన ప్రమేయం లేకుండా వచ్చే ఓటిపి షేర్ చేయడం, ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతకడం,ఆన్లైన్ కస్టమర్ కేర్ నంబర్స్ వెతకడం,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత లింక్స్ పెరితో ఎరవేసి క్లిక్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బుకు ఊడ్చేస్తారని,ఇలాంటి సైబర్ మోసాలు ఎక్కవగా జరుగుతున్నయని, ఇట్టి సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సైబర్ మోసగాల్లో చేతిలో మోసపోయిన బాధితుల కోసం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ వారియర్స్ ని నియమించడం జరిగిందని సైబర్ నేరాలకు గురైనవారు నేరుగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయలని తెలిపారు.

జిల్లాలో వారం రోజుల వ్యవధిలో వ్యవధిలో నమోదైన సైబర్ కేసులు.

1.వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఫైనాన్స్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాము మీకు లోన్ సాంగ్స్ ఉందని చెప్పారు దానికి లోన్ ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఖర్చులకోసం డబ్బు చెల్లించాలి అని చెప్పగా బాధితుడు నిజమా అనుకోని 42000/- పంపించడం జరిగింది ఈ విధంగా బాధితుడు 42,000/- రూపాయలను నష్టపోయాడు.

2.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు స్పీడ్ లోన్ అనే ఆప్ నుండి లోన్ తీసుకోవడం జరిగింది తర్వాత అతడు తిరిగి అలోన్ చెల్లించినప్పటికీ ఇంకా అమౌంట్ చెల్లించాలి అని లేకపోతే మీ ఫొటోస్ వీడియోస్ మార్నింగ్ చేసి మీ వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తామని బేరించగా బాధితుడు 22,000/-రూపాయలను పంపించడం జరిగింది.ఈ విధంగా పరిధిలో 22,000/- రూపాయలను నష్టపోయారు.

3.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు రాపిడో కస్టమర్ కేర్ కోసం గూగుల్లో వెతకగా ఒక ఫ్రాడ్ కస్టమర్ కేర్ నెంబర్ కనిపించింది ఆ నెంబర్ కి బాధితుడు కాల్ చేయగా అతడు నిజమైన రాపిడో కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఫోన్ పే కు 95,000/- రూపాయల రిక్వెస్ట్ పంపి దానిని మీకు డబ్బులు వస్తాయని బాధితుని నమ్మించి అందులో యూపీఐ పిన్ ఎంటర్ చేయగా బాధితుడు 95,000/-రూపాయలను నష్టపోయాడు.

4.కొనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి యూనియన్ బ్యాంక్ ఈ కేవైసీ చేసుకోవాలని ఒక టెక్స్ట్ మెసేజ్ రాదా అది నిజమే అనుకొని బాధితుడు అందులో బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ మరియు ఇతర అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయగా ఓటిపి వచ్చింది ఆ ఓటిపిని కూడా ఎంటర్ చేయడంతో దాదాపుగా 36 వేల రూపాయలను నష్టపోయాడు.

సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.1.లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.2.కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు.ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.3.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.4.లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.5.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు.వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.6.OLX, 99acres, Magicbricks లాంటా యాప్స్ లలో ఆర్మీ సోల్జర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.7.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.8.పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.9.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి.

లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube