సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన నాని( Nani ) ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ మరో వైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇక త్వరలోనే నాని సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదలకు మంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఈ క్రమంలోనే నాని ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![Telugu Nani, Junnu, Music, Nani Son Arjun, Nani Son Junnu, Nani Son Music, Tolly Telugu Nani, Junnu, Music, Nani Son Arjun, Nani Son Junnu, Nani Son Music, Tolly](https://telugustop.com/wp-content/uploads/2024/08/Nani-interesting-comments-about-his-son-junnu-detailsdd.jpg)
ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ ఈయనని ప్రశ్నిస్తూ ఈ సినిమా చేసిన తర్వాత మీకు శనివారం అంటే చాలా ఇష్టంగా మారిపోయిందా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నాకు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా శనివారం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి నాకు శనివారం ఇష్టం అని సరదాగా చెప్పారు.మనకు చదువు పెద్దగా ఇష్టం ఉండదు అందుకే సెలవుల కోసం ఎదురు చూసే వాడినని వెల్లడించారు.
![Telugu Nani, Junnu, Music, Nani Son Arjun, Nani Son Junnu, Nani Son Music, Tolly Telugu Nani, Junnu, Music, Nani Son Arjun, Nani Son Junnu, Nani Son Music, Tolly](https://telugustop.com/wp-content/uploads/2024/08/Nani-interesting-comments-about-his-son-junnu-detailss.jpg)
మీలాగే మీ కుమారుడు కూడా శనివారం కోసం ఎదురు చూస్తుంటారా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని తన కొడుకు జున్ను( Junnu ) గురించి మాట్లాడుతూ వాడు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటాడని తెలిపారు.ఒకప్పుడు మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు చదువు మాత్రమే చదవాలి.ఇప్పుడు అలా లేదు కదా పిల్లలకు ఎన్నో యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు.తద్వారా స్కూల్ కి వెళ్లడానికి కూడా ఇష్టపడుతున్నారు.నా కొడుకు ఇంత చిన్న వయసులోనే పియానో నేర్చుకున్నాడు అంటే వాడికి దాని పట్ల ఎంత ఆసక్తి ఉంటే అంత తొందరగా నేర్చుకుంటాడు.
మ్యూజిక్ అంటే వాడికి చాలా ప్రాణం భవిష్యత్తులో నా సినిమాకు వాడు మ్యూజిక్ డైరెక్టర్( Music Director ) గా పని చేస్తాడు అంటూ నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.