అమెరికాకు రావొద్దు.. ఆ ఉచ్చులో పడ్డారో : విద్యార్ధులకు ప్రవాస భారతీయుడి హెచ్చరికలు

అమెరికాలో చదువు, ఉద్యోగం అనేది లక్షలాది మంది భారతీయ విద్యార్ధుల(Indian students) కల.ఇందుకోసం చిన్నప్పటి నుంచే ప్లానింగ్‌తో చదువుకుంటారు.

 Indian Expat In Us Warns Students Of Visa And Immigration Trap. America, Indian-TeluguStop.com

తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు ఏం కావాలో అన్ని సమకూరుస్తూ వుంటారు.బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు లోన్ సౌకర్యం కల్పిస్తుండటంతో అగ్రరాజ్యానికి పరుగులు తీసేవారి సంఖ్య పెరుగుతోంది.

అయితే వారు చేసే చిన్న చిన్న తప్పులు క్షణ కాలంలో అమెరికా కల చెదిరిపోవడానికి కారణమవుతుంది.

Telugu America, Atlanta, Chicago, Hb Visa, Indian Expat, San Francisco, Suren-Te

కొద్దిరోజుల క్రితం అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్ధులను(Indian students) అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకుని తిరిగి ఇండియాకు పంపించేశారు.శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, అట్లాంటా(San Francisco, Chicago, Atlanta) నగరాల నుంచి ఎక్కువ మందిని వెనక్కి పంపారు.పత్రాలు, వివరాలన్నీ సరిగ్గానే వున్నప్పటికీ ఎందుకు వీరిని డిపోర్ట్ చేశారనేది తెలియక విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయితే గనుక మళ్లీ ఐదేళ్ల వరకు అగ్రరాజ్యంలో అడుగుపెట్టడానికి అనర్హులు.

ఈ నేపథ్యంలో యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానాలను విమర్శిస్తున్న భారత సంతతికి చెందిన వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు, ప్రవాస భారతీయులు.అబద్ధాలను నమ్మి అమెరికాకు రావొద్దని రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ సురేన్ విద్యార్ధులకు సూచించారు.

భారత్‌లో జరగనున్న ఎడ్యుకేషన్ యూఎస్ఏ(USA) ఫెయిర్‌లకు హాజరుకావాలని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారతీయ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ చేసిన పోస్ట్‌పై ఆయన స్పందించారు.

Telugu America, Atlanta, Chicago, Hb Visa, Indian Expat, San Francisco, Suren-Te

తాను అమెరికాలో ఉన్నానని.21 సంవత్సరాల క్రితం తాను భారత్ నుంచి వచ్చానని, అప్పటి రోజులు వేరని సురేన్(Suren) అన్నారు.అమెరికాలో గ్రీన్ కార్డ్ నిరీక్షణ దయనీయంగా మారిందని.ఇమ్మిగ్రేషన్ అనేది మునుపెన్నడూ లేనంతగా చట్టపరమైన వలసదారులకు బాధాకరమైన అంశంగా మారిందన్నారు.కెనడాకు కూడా వెళ్లొద్దని, మీకు అక్కడ పౌరసత్వం లభించినా ఉద్యోగాలు లేవని, శాంతి భద్రతల పరిస్ధితి గురించి చెప్పనక్కర్లేదని సురేన్ అన్నారు.

అమెరికాకు వచ్చే భారతీయులకు అత్యంత భయంకరమైన సవాల్ గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్.

యూఎస్ ఇమ్మిగ్రేషన్ (us immigration)సిస్టమ్ ప్రకారం.ఒక్కో దేశానికి 7 శాతం నిబంధన కారణంగా, భారతీయులు గ్రీన్‌కార్డ్ పొందాలంటే 100 ఏళ్లు నిరీక్షించాల్సి ఉంటుంది.హెచ్1 బీ వీసాకు(H1B visa) సైతం అదే స్థాయిలో పోటీని ఎదుర్కోవాలి.అంతేకాదు.

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన పక్షంలో ఈ వీసాపై ఉన్న వారు అగ్రరాజ్యాన్ని వీడాల్సి ఉంటుంది.ఈ పరిణామాలనే సురేన్ హైలైట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube