జనసేన సరికొత్త రికార్డ్ .. వారంలో 14 లక్షలు 

ఏపీలో జనసేన పార్టీ( Jana Sena Party ) దూకుడు కొనసాగుతూనే ఉంది.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ విజయం సాధించడం , ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఆ పార్టీ కి ప్రాధాన్యం మరింతగా పెరిగింది.

 Janasena Membership Program New Record, Janasena, Janasenani, Ysrcp, Telugudesa-TeluguStop.com

వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.చేరికలు విషయంలో ఆచితూచి జనసేన వ్యవహరిస్తోంది.

చేరికల విషయంలో మిత్రపక్షలతో సంప్రదింపులు చేస్తూ,  వారికి అభ్యంతరం లేకుండా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తుంది.ఒకపక్క మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ , పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నా.

  మరోవైపు సొంతంగా ఏపీలో బలం పెంచుకునే విషయం పైన జనసేన ఫోకస్ చేసింది.  దీనిలో భాగంగానే సభ్యత్వ నమోదుకి ఇప్పటికే శ్రీకారం చుట్టింది.

ఈ సభ్యత్వ నమోదు కు ఇప్పుడు ఊహించని స్థాయి లో స్పందన కనిపిస్తోంది.ఈ మేరకు జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.

Telugu Ap, Janasena, Janasenani, Telugudesam, Ysrcp-Politics

పార్టీ సభ్యత్వాలు గత ఏడాది కంటే రెట్టింపు కావడంతో,  జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెంచుతుంది.  నిన్నా .మొన్నటి వరకు జనసేన పార్టీకి క్యాడర్ లేదు.  కేవలం సానుభూతిపరులు , పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులతోనే గత పదేళ్లుగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి,  జనసేన , బిజెపి  కూటమి విజయం సాధించడం,  జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలోను గెలుపొందడంతో,  పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విషయంపై ఫోకస్ చేసింది.రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాలలోనూ కేడర్ ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం దొరికింది.

Telugu Ap, Janasena, Janasenani, Telugudesam, Ysrcp-Politics

గత నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ంది.ఈ సంవత్సరం పదిలక్షలకు పైగా సభ్యత్వల ను నమోదు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకుంది.వాస్తవంగా జులై 18 నుంచి 28 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా, అప్పటికే 10 లక్షలు సభ్యత్వాలు దాటడంతో, మరో 10 రోజులు గడువు పెంచింది.  రెండు వారాల్లోని 13 నుంచి 14 లక్షల వరకు సభ్యత్వాలు నమోదు అయినట్టు జనసేన చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube