రాజ్ తరుణ్ నాకొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన లావణ్య.. అసలేం జరిగిందంటే?

గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు లావణ్య,( Lavanya ) రాజ్ తరుణ్.( Raj Tarun ) దాదాపుగా నెల రోజులుగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.

 New Twist In Raj Tarun Lavanya Controversy Details, Raj Tarun, Lavanya, Controve-TeluguStop.com

ముఖ్యంగా రాజ్ తరుణ్ విషయంలో లావణ్య మీడియా ముందు చేస్తున్న హడావిడి అంతా ఎంత కాదు.తను నాకు వద్దు అని రాజ్ తరుణ్, తను నాకు కావాలి అంటూ లావణ్య ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.

పెళ్లి చేసుకుని, అబార్షన్స్ చేయించాడు, ఇపుడు తనని వదిలేసి వేరే హీరోయిన్ తో కలిసి ఉంటున్నాడు.

Telugu Controversy, Raj Tarun, Lavanya, Twist, Rajtarun, Shekar Basha, Tollywood

నా రాజ్ నాకు కావాలంటూ నానా రచ్చ చేసిన లావణ్య ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చింది.నాకు రాజ్ తరుణ్ వద్దు, నేను కావాలనుకుంటున్న రాజ్ తరుణ్ నన్ను అర్థం చేసుకోవడం లేదు.రాజ్ తరుణ్ పదే పదే మాకు పెళ్లి ( Marriage ) కాలేదు అని వాదిస్తున్నాడు.

నేను అలాగే అనుకుంటాను.కానీ పెళ్లి కాకుండా 11 ఏళ్ళు ఎలా కలిసి ఉన్నాడు అంటూ లావణ్య ఒక భారీ ట్విస్ట్ ఇచ్చింది.

రెండు రోజుల క్రితం రాజ్ తరుణ్ ని కలవాలంటూ ప్రసాద్ ల్యాబ్( Prasad Lab ) దగ్గర రచ్చ చేసిన లావణ్య ఆ తర్వాత మాదాపూర్ లోని రాజ్ తరుణ్ ఇంటి ముందు కూడా రచ్చ చేసింది.దానితో రాజ్ తరుణ్ తల్లితండ్రులు లావణ్య పై పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెట్టారు.

Telugu Controversy, Raj Tarun, Lavanya, Twist, Rajtarun, Shekar Basha, Tollywood

అటు రాజ్ తరుణ్ అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టుని ఆశ్రయించాడు.ఇలాంటి సమయంలో రాజ్ తరుణ్ నాకొద్దు అంటూ లావణ్య ట్విస్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.నాలుగు గోడల మధ్యన జరిగిన గొడవను నేను వీధి మీదకి తీసుకోచ్చాను.నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను, ఎవ్వరు సహాయం చెయ్యలేదు.నేను రాజ్ తరుణ్ ని ఎక్కడా తప్పుగా చూపించలేదు.కానీ రాజ్ మాత్రం తన ఫ్రెండ్ శేఖర్ బాషా తో( Shekar Basha ) కలిసి నాపై చాలా ఆరోపణలు చేసాడు.

అవి నన్ను బాధించాయి.రాజ్ నాతో ఉండడానికి ఇష్టపడడం లేదు.

అలాంటి రాజ్ నాకు వద్దు.నేను రాజ్ తరుణ్ తో 11 ఏళ్ళు కలిసి ఉన్నాను.

అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి రాజ్ ని కలవనివ్వమని గొడవ చేశాను.కానీ రాజ్ పేరెంట్స్ అది అర్ధం చేసుకోకుండా నాపై కేసు పెట్టారు.

ఇక నేను ఈ గొడవలు పడలేను, నాకు రాజ్ వద్దు అంటూ లావణ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube