కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం, మృతుల్లో అన్నదమ్ములు

కెనడాలో( Canada ) విషాదం చోటు చేసుకుంది.శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలవ్వగా.

 2 Siblings Among 3 Indian Students Killed In Road Accident In Canada Details, 2-TeluguStop.com

వీరిలో ఇద్దరు అన్నదమ్ములే కావడం దురదృష్టకరం.ఈ తోబుట్టువులను పంజాబ్ రాష్ట్రం లూథియానా సమీపంలోని మలౌద్ గ్రామానికి చెందిన హర్మాన్ సోమల్ (23),( Harman Somal ) నవజోత్ సోమల్ (19)గా( Navjot Somal ) గుర్తించారు.

మూడో వ్యక్తి కూడా పంజాబ్ రాష్ట్రానికే చెందిన యువతిగా గుర్తించారు.సంగ్రూర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న భూపిందర్ సింగ్ , సుచేత్ కౌర్ దంపతుల కుమార్తె రష్మ్‌దీప్ కౌర్ (23)( Rashmdeep Kaur ) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రష్మ్‌దీప్ కౌర్ బంధువు చమ్‌కౌర్ సింగ్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.విద్యార్ధులు మౌంటెన్ సిటీలో( Mountain City ) తమ పీఆర్‌ (పర్మినెంట్ రెసిడెంట్) ఫైల్‌లను సమర్పించి , టాక్సీలో తిరిగి వస్తుండగా టైర్ పగిలి వాహనం బోల్తా పడిందని చెప్పారు.

ముగ్గురు పిల్లలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.టాక్సీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయని చమ్‌కౌర్ తెలిపారు.నాలుగేళ్ల క్రితమే రష్మ్‌దీప్ కౌర్ కెనడా వెళ్లారని చెప్పారు.

Telugu Indian, Canada, Canada Indian, Canada Road, Chamkaur Singh, Harman Somal,

కాగా.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్ధుల( Indian Students ) సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది.ఒకరిని చూసి మరొకరు మన పిల్లలంతా ఛలో ఫారిన్ అంటున్నారు.

దీంతో ఆయా దేశాల్లోని విద్యాసంస్థలు భారతీయ విద్యార్ధులతో కిటకిటలాడుతున్నాయి.అయితే అక్కడ హత్యలు, యాక్సిడెంట్లు, అనారోగ్యం, ఇతర కారణాలతో మన విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు.

జీవితంలో గొప్ప స్థితికి చేరుకుంటారనుకున్న తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Telugu Indian, Canada, Canada Indian, Canada Road, Chamkaur Singh, Harman Somal,

గడిచిన ఐదేళ్ల కాలంలో దాదాపు 633 మంది భారతీయ విద్యార్ధులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ మేరకు గణాంకాలు వెల్లడించారు.172 కేసులతో ఈ లిస్టులో కెనడా అగ్రస్థానంలో ఉండగా.అమెరికాలో 108, యూకేలో 58 , ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, ఉక్రెయిన్‌లో 18, జర్మనీలో 24, జార్జియా, కిర్గిస్తాన్, సైప్రస్‌లలో 12, చైనాలో 8 మంది విద్యార్ధులు మరణించినట్లు పేర్కొన్నారు.అలాగే 19 మంది భారతీయ విద్యార్ధులు దాడుల్లో చనిపోయినట్లు మంత్రి తెలిపారు.

ఈ తరహా ఘటనల్లో కెనడాలో 9 మంది, అమెరికాలో ఆరుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినట్లు కీర్తి వర్ధన్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube