రేపు రెండో విడుత రుణమాఫీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ రెండవ విడుత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన ( మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Tomorrow Is The Second Release Of Loan Waiver, Loan Waiver, Collector Sandeep Ku-TeluguStop.com

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధుల, రైతుల, అధికారుల సమక్షంలో రెండో విడుత రుణమాఫీ రూ.1.50 లక్షల కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

ఈ రుణమాఫీ కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులైన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube