ముగిసిన టైప్ రైటింగ్ పరీక్షలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా :టైప్ రైటింగ్ పరీక్షలు వర్షప్రభావం ఉన్నా కూడా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ బి.రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రశాంతంగా శనివారం ముగిశాయి.

 Completed Typewriting Tests , Rajanna Sirisilla District, Polytechnic College,-TeluguStop.com

ప్రిన్సిపాల్ రాజగోపాల్ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.వర్షంలో కూడా విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదర్శ, స్టూడెంట్ టైప్ రైటింగ్ ఇనిస్ట్యూట్ ప్రిన్సిపాల్స్ మజీద్, రఫీ లు మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకోసారి ప్రభుత్వం టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈనెల 20న ఇంగ్లీష్, తెలుగు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ రెండు బ్యాచులు నిర్వహించారు.

వాతావరణ దృష్ట్యా ఈనెల 21న జరిగే పరీక్షను రాష్ట్ర టెక్నికల్ బోర్డు వాయిదా వేయడం జరిగింది.మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు( DSC Exams ) ప్రారంభమవుతున్నందున శనివారం యధావిధిగా టైప్ రైటింగ్ పరీక్షలను నిర్వహించారు.

టైప్ రైటింగ్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలలో ఉపాధి పొందడం సులభతరం అవుతుందని, కంప్యూటర్ పై గంట వ్యవధిలో చేసే పనిని, టైపు పాసైన వారు కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. నిరుద్యోగులే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పరీక్షలకు హాజరవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్స్ మజీద్, రఫీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube