రేణు దేశాయ్ కు చీర సారే పెట్టి సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదేనా?

సినీనటి రేణు దేశాయ్( Renu Desai ) తాజాగా తెలంగాణ పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) గారిని కలిశారు.హైదరాబాద్ లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల విషయాలపై కులంకుషంగా చర్చించారు.

 Actress Renu Desai Meets Telangana Minister Konda Surekha, Konda Surekha, Renu-TeluguStop.com

రేణు దేశాయ్ ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తోన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోని ఈమె మంత్రిని కలిసి ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను అందజేశారు.ఇలా తన ఇంటికి సినీనటి రేణు దేశాయ్ రావడంతో కొండా సురేఖ సైతం ఆమెకు సాదర స్వాగతం పలకడమే కాకుండా తన ఇంటికి రావడంతో చీర సారే కూడా పెట్టి పంపించారు.అంతేకాకుండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్ కి తన చేతులతో అలంకరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

ఇక కొండ సురేఖ తనకు ఇచ్చిన ఆతిథ్యం గురించి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఇలా పర్యావరణ జంతువు ప్రేమికురాలుగా ఉన్నటువంటి ఈమె తెలంగాణ పర్యావరణ అటవీ శాఖ మంత్రిని కలవడంతో త్వరలోనే ఏపీ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని ( Pawan Kalyan ) కూడా కలవబోతున్నారంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.

ఇలా తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.మరి ఈమె తెలంగాణ మంత్రిని కలిసిన విధంగానే ఏపీ మంత్రిని కూడా కలుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube